Priyanka Gandhi: 'ఆమె ఏ గ్రహం మీద నివసిస్తోంది'.. నిర్మలపై ప్రియాంక గాంధీ సెటైర్లు

ఇటీవల బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. తన ప్రసంగంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై మట్లాడిన అంశాలను ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. అసలు ఆమె ఏ గ్రహం మీద ఉంటున్నరో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Nirmala Sitharaman and Priyanka gandhi

Nirmala Sitharaman and Priyanka gandhi

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్రంగా విమర్శలు చేశారు. ఇటీవల పార్లమెంటులో నిర్మలా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన సమాధానంపై ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వివరాల్లోకి బడ్జెట్‌ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణం, ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు. ప్రభుత్వం తీసుకునే మొత్తం రుణాన్ని 2025-26 మూలధన వ్యయాలకు వినియోగించబోతోందని చెప్పారు. 

Also Read: భర్తముందే కూతుళ్లపై ప్రియుడితో అత్యాచారం చేయించిన తల్లి.. ‘వలయార్ కేసు’లో భయంకర నిజాలు!

అలాగే నిరుద్యోగంపై కూడా స్పందించారు. అయితే నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలను ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. '' దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ధరల పెరుగుధల లాంటివి లేవని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. అసలు ఆమె ఏ గ్రహం మీద ఉంటున్నరో నాకు అర్ధం కావడం లేదని'' ప్రియాంక గాంధీ సెటైర్లు వేశారు. ఇదిలాఉండగా ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విపక్షాలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బిహార్ ఎన్నికలే టార్గెట్‌గా ఈ బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు ఆరోపణలు చేశాయి.  

Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో 21413 పోస్టల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!

ఇదిలాఉండగా ఈసారి బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరటనిచ్చేలా రూ.12 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు పన్ను చెల్లించే శ్లాబ్‌లను కూడా మార్చారు.  రూ. 75000 స్టాండర్డ్ డిడక్షన్  కలిపితే రూ. రూ.12,75,000 వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మధ్యతరగతి ప్రజలు స్వాగతించారు. నిర్మలా సీతారామన్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. 

Also Read: పారిస్ ఏఐ సమ్మిట్‌.. అలాంటి వారికే ఉద్యోగవకాశాలు ఉంటాయన్న ప్రధాని మోదీ

Also Read: Trump: ట్రంప్ నిర్ణయంతో హెచ్‌ఐవీ మరణాలు 63 లక్షలు పెరుగుతాయంటున్న ఐరాస...!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు