New Income Tax Bill 2025: పార్లమెంటులో కొత్త ఐటీ బిల్లు-2025ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను (IT) బిల్లు-2025 ను ప్రవేశపెట్టారు. ఈ చట్టం 2025 ఏప్రిల్‌లో అమలవుతుందని అంచనా వేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Nirmala Sitharaman

Nirmala Sitharaman

New Income Tax Bill 2025: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman) గురువారం లోక్‌సభ(Lok Sabha)లో కొత్త ఆదాయపు పన్ను (IT) బిల్లు-2025 ను ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు కొనసాగుతున్న పాత ఆదాయపు పన్ను యాక్ట్‌-1961 దాదాపు 60 ఏళ్ల తర్వాత మారనుంది. తాజాగా ప్రతిపాదించిన ఈ కొత్త చట్టాన్ని ఇన్‌కమ్‌ ట్యాక్స్ యాక్ట్ 2025గా పిలవనున్నారు. ఈ చట్టం 2025 ఏప్రిల్‌లో అమలవుతుందని అంచనా వేస్తున్నారు. దేశంలో కొనసాగుతున్న పన్నుల చట్టాలను ఏకీకృతం చేయడం, సవరణలు చేసేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు.     

Also Read: పోలీసుల ఆపరేషన్ సక్సెస్.. భారీగా లొంగిపోయిన మావోయిస్టులు!

అయితే లోక్‌సభలో ఈ ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు 2025ను ప్రవేశపెట్టినప్పటికీ పార్లమెంటులో ఇది ఆమోదం పొందడానికి సమయం పడుతుంది. ఈ ఐటీ బిల్లుపై సమీక్ష చేసేందుకు కమిటీకి పంపించనున్నారు. దీనిపై పరిశీలన అనంతరం.. కమిటి తన సిఫార్సులను తెలియజేస్తుంది. ఆ తర్వాత ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు 2025 కేంద్ర కేబినెట్‌ ద్వారా ప్రభుత్వానికి పంపించపడుతుంది. ఆ తర్వాత కేబినెట్‌ సిఫార్సులను పరిశీలిస్తుంది. అనంతరం ఐటీ బిల్లు మళ్లీ పార్లమెంటుకు వెళ్తుంది. పార్లమెంటులో ఇది ఆమోదం పొందాక.. దాన్ని ఎప్పుడు అమలు చేయాలో కేంద్రం నిర్ణయిస్తుంది. 

Also Read: మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్!

ఇన్‌కమ్‌ ట్యాక్స్ బిల్లు 2025 

ఈ కొత్త ఐటీ బిల్లు-2025 అనేది భారత పన్ను చట్టాలను ఏకీకృతం చేస్తుంది. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న ఆదాయపు పన్ను చట్టంలో ఉన్న లోపాలను ఇది తొలగిస్తుంది అలాగే న్యాయపరమైన చిక్కులను తగ్గిస్తుంది. అంతేకాదు ఈ కొత్త ఐటీ బిల్లు.. పన్ను చెల్లింపుదారుల కోసం మరింత పారదర్శకంగా, అనుకూలంగా ఉండేలా పన్ను చట్టాలను సులభతరం చేస్తుంది.

Also Read:  బెస్ట్ సీఎంగా యోగి.. చంద్రబాబుకు నాలుగో స్థానం.. రేవంత్ ర్యాంకు ఎంత?

Also Read:  ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు