Budget 2025: బడ్జెట్‌కు సిద్ధం.. ఆర్థిక మంత్రి బృందంలో ఆ ఐదుగురిదే కీలక పాత్ర

ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ 2025ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్‌ను రూపొందిన ఆర్థిక మంత్రి బృందంలో ఐదుగురు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వాళ్ల గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.

author-image
By B Aravind
New Update
Nirmala Seetharaman

Nirmala Seetharaman

జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు రెండు విడుతల్లో జరగనున్నాయి. తొలి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయి. రెండో విడుత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. ఇక ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ 2025ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్‌ను రూపొందిన ఆర్థిక మంత్రి బృందంలో ఐదుగురు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వాళ్ల గురించి తెలుసుకుందాం.

తుహిన్ కాంత్ పాండే

తుహిన్ కాంత్ పాండే ఒడిశా కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ IAS అధికారి. ప్రస్తుతం ఈయన ఆర్థిక, రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆదాయ వసూళ్లతో పాటు పన్ను రాయితీల అంచనాలను కూడా ఆయన నిర్వహిస్తున్నారు. బడ్జెట్‌కు కొద్ది రోజుల ముందు ఆర్థిక మంత్రి బృందంలో ఆయన నియమకం అయ్యారు. బడ్జెట్‌కు సంబంధించి ఆదాయపు పన్ను చట్టంలో మార్పులను పాండే పర్యవేక్షిస్తున్నారు.

అజయ్ సేథ్  

అజయ్ సేథ్.. కర్ణాటక కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ IAS అధికారి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే బడ్జెట్ పత్రాన్ని తయారు చేయడం, స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించే బాధ్యత విభాగానికి అధిపతిగా ఉన్నారు. వినియోగ ప్రోత్సాహకాల కోసం డిమాండ్ పెరుగుతున్నప్పుడు వాటిపై అనుసరించాల్సిన వ్యూహాలను ఆయన నిశితంగా పరిశీలిస్తు్నారు.
 

వి.అనంత నాగేశ్వరన్, 

వి.అనంత నాగేశ్వరన్.. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. IIM అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి. మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందారు. గతంలో ఈయన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో పార్ట్ టైమ్ సభ్యునిగా ఉన్నారు. ఆయన బృందం రూపొందించిన ఆర్థిక సర్వే సంస్కరణలు, నియంత్రణ చర్యలు బడ్జెట్‌లో కీలకంగా మారనున్నాయి.

మనోజ్ గోవిల్

మనోజ్ గోవిల్.. మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 1991 బ్యాచ్ IAS అధికారి. ప్రస్తుతం వ్యయ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. సబ్సిడీలు, కేంద్ర ప్రాయోజిత పథకాలను హేతుబద్ధీకరించడం, ప్రభుత్వ ఖర్చుల నాణ్యతను మెరుగుపరచడం వంటి బాధ్యతలు ఆయన స్వీకరించారు. బడ్జెట్‌ ఈ విభాగం కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

ఎం.నాగరాజు

ఎం.నాగరాజు త్రిపుర క్యాడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. బొగ్గు శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేసిన తర్వాత ఆయన ఆర్థిక సేవల శాఖ (DFS)లో చేరారు. క్రెడిట్ ఫ్లో, డిపాజిట్ సమీకరణ, ఫిన్‌టెక్‌ని నియంత్రించడం, బీమా కవరేజీని విస్తరించడం, డిజిటల్ ఇంటర్‌ఫేస్‌లను మెరుగుపరచడం లాంటి వాటిపై ఈయన బృందం పనిచేస్తోంది. అలాగే బ్యాంకింగ్‌తో పాటు మార్కెట్‌లో మూలధన ప్రవాహాలను కూడా పర్యవేక్షిస్తోంది. బడ్జెట్‌లో ఈ అంశాలు కూడా కీలకంగా మారనున్నాయి. 
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు