Teacher Student love : టీచర్‌కు చాలా విలువైన స్థానం ఉంటుంది. పిల్లలను తీర్చిదిద్దడంలో వారే ప్రముఖ పాత్ర పోషిస్తారు కాబట్టి..వారికి ఎవ్వరికీ ఇవ్వని గౌరవం ఇస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పాఠాలు చెప్పాల్సిన టీచర్లు వెధవ పులు చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. కొన్ని చోట్ల వారి మరణాలకు కూడా కారణం అవుతున్నారు. మధ్యప్రదేశ్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఇండోర్‌కు చెందిన 19 ఏళ్ళ బీ ఫార్మసీ విద్యార్థి గౌరవ్ తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. దానికి కారణం అతని టీచర్ ఆకాంక్ష.
గౌరవ్, అతని టీచర్ ఆకాంక్ష కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారు హద్దులను కూడా దాటారు. అయితే ఉన్నట్టుండి ఏమైందో తెలియదు..ఆకాంక్ష…గౌరవ్ తనను రేప్ చేశాడంటూ కేసు పెట్టింది. దీంతో ఇండోర్ పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. అయితే అతని తండ్రి 45 వేలు ఇచ్చి గౌరవ్‌ను విడిపించారు. కానీ అతని మీద పెట్టిన కేసను విత్‌డ్రా చేసుకోవడానికి ఆకాంక్ష 5 లక్షలు డిమాండ్ చేసిందని గౌరవ్ తండ్రి చెప్పారు.
అయితే గౌరవ్ ఈ మొత్తం వ్యవహారం కాణంగా తీవ్ర మనస్తాపం చెందాడు. అరెస్ట్ అయి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి ఇంట్లో తన రూమ్ డోర్ వేసుకుని ఉడిపోయాడు. ఎంతకీ బయటకు రాకపోయేసరికి అతని చెల్లెలు వెళ్ళి చూసింది. గౌరవ్ ఉరేసుకుని కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. కానీ అప్పటికే గౌరవ్ చనిపోయాడు. మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత.. కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని మహిళా పోలీస్ స్టేషన్ ముందు ఉంచి నిరసన వ్యక్తం చేశారు. ఆ స్టేషన్ సీఐ కౌశల్య చౌహాన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
INDORE : 19 yr old Gaurav hanged himself to death after a #falserape case was lodged against him by 25 yr old Teacher Akanksha who was in relationship with him since 11 months
Akanksha allegedly demanded 5 Lacs to take back case
NO ACTION YET by @MPPoliceDeptt @MPPoliceOnline pic.twitter.com/cbn6JNHfGL
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) August 9, 2024