Love Scam : ఇదేం ప్రేమరా నాయనా...సొంతింటి కల కోసం..20 మంది అబ్బాయిలతో ప్రేమాయణం

చైనాకు చెందిన ఒక యువతి సొంత ఇంటి కలను నిజం చేసుకోవడానికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మందితో ప్రేమాయణం నడిపింది. ఇప్పుడీ ఘటన  సోషల్ మీడియాను షాక్‌ గురిచేస్తోంది. ఒకరికి తెలియకుండా మరోకరు ఇలా 20 మందితో ప్రేమ వ్యవహారం నడిపింది.

New Update
Chinese woman bought a house

Chinese woman bought a house

Love Scam : ఒకప్పుడు అబ్బాయిల చేతిలో మోస పోయిన అమ్మాయిల ఘటనలే వార్తలయ్యేవి. కానీ, మారుతున్న మానవసంబంధాల నేపథ్యంలో ఇప్పుడు అంతా రివర్స్‌ అయింది. అబ్బాయిలను ప్రేమ పేరుతో మోసం చేయడం, వారిని అవసరానికి వినియోగించుకుని వారివద్ద డబ్బులు కొట్టేయడం, ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఆ తర్వాత డబ్బులతో ఉడాయించడం, ఇదేది సాధ్యం కాకపోతే ఏకంగా లేపేయడం ఇటీవల సర్వసాధారణమై పోయింది. అంతేకాదు, ప్రేమ, స్నేహం అనే ముసుగులు కప్పుకొని మనసు విశాలం చేసుకుని ఒకరికి మించి లవర్స్‌ను మెయింటన్‌ చేయడం నేటితరం అమ్మాయిలకు చాలా చిన్నవిషయమై పోయింది.  అలాంటిదే చైనాకు చెందిన ఒక యువతి సొంత ఇంటి కలను నిజం చేసుకోవడానికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మందితో ప్రేమాయణం నడిపింది. ఇప్పుడీ ఘటన  సోషల్ మీడియాను షాక్‌ గురిచేస్తోంది.  

చైనా‌లోని షెన్జెన్‌కు చెందిన  షియాలీ అనే యువతి ఓ ఇంటిని ఇష్టపడింది. అయితే ఆ ఇంటిని కొనడానికి తన వద్ద డబ్బులు లేవు. దీంతో తన కలల ఇంటిని సొంతం చేసుకోవడానికి ఆ యువతి చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. సొంతింటి కల నెరవేర్చుకోవడానికి  చైనా అమ్మాయి ఏకంగా 20 మంది బాయ్‌ ఫ్రెండ్స్‌ తో ఒకరిని ఒకరికి తెలియకుండా ప్రేమ వ్యవహారం నడిపింది. యువకులను  ప్రేమ మత్తులో నిండుగా ముంచిన ఆ అమ్మాయి తన 20 మంది బాయ్ ఫ్రెండ్స్ తో ఒక్కో ఐఫోన్ ను కొనిపించుకుంది. అలా తన వద్ద 20 ఐఫోన్లు వచ్చి చేరాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్న..ఆ తర్వాత ఆ మొబైల్స్ ను బయటి మార్కెట్ లో అమ్మి సొంత ఇంటిని కొనుక్కుంది. 

అవును మీరు చదువుతున్నది నిజమే...ఆ అమ్మాయి తన ఇంటికోసం 20 మంది బాయ్‌ఫ్రెండ్స్‌ను వినూత్నంగా ఉపయోగించుకుంది. మార్కెట్లోకి వచ్చిన కొత్త ఐఫోన్ ఎంపిక చేసి ఆమె ఒక్కొక్క బాయ్‌ఫ్రెండ్‌ను అడిగి, ఒక్కొక ఫోన్ తీసుకుంది. ఆ తర్వాత వాటన్నింటినీ ఓ మొబైల్ రీసైక్లింగ్ కంపెనీకి అమ్మేసింది. అలా అమ్మగా  ఆమెకు ఏకంగా 1,20,000 యువాన్స్ వచ్చాయి. అంటే మన ఇండియన్‌ కరెన్సీలో  రూ 14 లక్షలు అనుకోండి. అలా వచ్చిన సొమ్ముతో తాను ఎప్పటి నుంచో కలలు కంటున్న ఓ ఇంటిని కొనుక్కుంది. నిజానికి ఈ విషయం ఎలా బయటకు వచ్చిందో తెలియకపోయిన ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ లో ఈ విషయం వైరల్ అవుతోంది.

 షియాలీ మధ్యతరగతి కుటుంబానికి చెందింది. ఆమె తండ్రి మైగ్రంట్ వర్కర్‌గా, తల్లి గృహిణిగా ఉన్నారు. పెద్దకూతురు ఐన షియాలీ మీద కూడా కుటుంబ భారం పడడంతో పాటు తల్లిదండ్రులు వయసు మీదపడటంతో సొంత ఇల్లు అత్యవసరం అయింది. దీంతో తన అందాన్నే ఎరగా వేసి అబ్బాయిలను ఆకర్శించింది. అలా ఒకరు..ఇద్దరు కాదు. ఏకంగా 20 మందిని లైన్లో పెట్టింది. అలా తన సొంత ఇంటి కలను నిజం చేసుకుంది. ఈ విషయం నెట్టింట వైరల్‌ కావడంతో పలువురు పలు విధాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆమెను మోస గత్తే అని ఆగ్రహం వ్యక్తం చేస్తే మరికొందరు అమె చేసిన పనిని అభినందిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు