/rtv/media/media_files/2025/02/15/UJiTCJTdMoDtzGKHyuu6.jpg)
Madyapradesh High Court sensational Verdict on illicit relationship
MP Highcourt: వివాహేతర సంబంధాల కేసులపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్య మరొక పురుషుడితో శారీరక సంబంధం పెట్టుకోకుండా ప్రేమించడం అక్రమ సంబంధం((Illegal Relationships)) కిందకి రాదని స్పష్టం చేసింది. ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తప్పుగా పరిగణించలేం..
ఈ మేరకు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య మరో వ్యక్తితో ప్రేమలో పడ్డట్లు తెలుపుతూ కోర్టుకెక్కాడు. తనను కాదని మరో వ్యక్తిని కోరుకుంటున్న ఆమెకు భరణం పొందే హక్కులేదంటూ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఒక వివాహిత పరాయి పురుషుడితో లైంగికంగా కలిస్తేనే అది అక్రమసంబంధం అవుతుంది. ఎలాంటి శారీరక సంబంధం లేకుండా ఇష్టం పడటాన్ని తప్పుగా పరిగణించలేం. భర్తతో విడిగా ఉంటున్న ఆమెకు చట్ట ప్రకారం భరణం ఇవ్వాల్సిందేనని చెప్పింది. ఈ కేసులో ఆమెకు రూ.4వేల మధ్యంతర భరణం చెల్లించాలని ఫ్యామిలీకోర్టు ఫిటిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Tariffs: ట్రంప్ టారీఫ్ లతో భారత్ కు నష్టమా...లాభమా?
భర్త లైంగిక దాడి నేరం కాదు..
ఇదిలా ఉంటే.. ఇటీవల భార్య అనుమతి లేకుండా భర్త లైంగిక చర్యకు పాల్పడితే అది నేరం కాదని చత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2017లో తన అనుమతి లేకుండా భర్త అసహజ లైంగిక చర్యకు గురైన ఒక మహిళ కేసును విచారిస్తున్నప్పుడు సింగిల్ బెంచ్ ఈ తీర్పు చెప్పింది. సదరు మహిళ అనారోగ్యం పాలై హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ చనిపోయింది. ఆమె ఇచ్చిన మరణవాగ్మూలంలో తన చావుకు భర్తే కారణమని చెప్పింది. దీంతో ట్రయల్ కోర్టు భర్తకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా భర్త హైకోర్టును ఆశ్రయించాడు.
ఇది కూడా చదవండి:ఆ విషయంలో భర్త బలవంతం చేసినా తప్పుకాదు: హైకోర్టు
ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మసనం జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ ఈ కేసును విచారించారు. భార్య మైనర్ అయితే వారి మధ్య జరిగిన లైంగిక చర్యను మాత్రమే అత్యాచారంగా పరిగణిస్తామని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. భారతదేశంలో వైవాహిక అత్యాచారం నేరం కాదు. భార్య 18 ఏళ్లలోపు ఉంటేనే వివాహాలలో బలవంతంగా లైంగిక సంబంధం నేరం అవుతుంది. అసహజ లైంగిక సంబంధాన్ని నేరంగా పరిగణించలేమని కోర్టు తెలిపింది. హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేసి భర్తను నిర్దోషిగా విడుదల చేసింది. భర్తపై మోపిన ఐపిసి సెక్షన్ 376, 377 కింద నేరం రుజువైనది కాదని హైకోర్టు భావించింది.
ఇది కూడా చదవండి: Tamilanadu: ఒక్క నిమ్మకాయ అక్షరాలా రూ.6 లక్షలు.. అందులో ఏమంతా స్పెషల్ ఉందబ్బా!
Also Read: Horoscope Today:ఈ రోజు ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్!
Follow Us