Jyoti Malhotra: నన్నుపెళ్లి చేసుకో.. ISI ఏజెంట్‌కు జ్యోతి ప్రపోజల్.. బయటపడ్డ సీక్రెట్ చాట్!

పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరో సంచలన విషయం బయటపడింది. పాక్ ISI ఏజెంట్ అలీ హసన్‌తో ఆమె లవ్‌లో ఉన్నట్లు తేలింది. 'నన్ను పాక్‌లో పెళ్లి చేసుకో' అంటూ అతనికి ప్రపోజ్ చేసిన సీక్రెట్ చాట్ బయటపడింది. ఆమెకు 4 అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు.

New Update
jyothi isi

Jyoti Malhotra love chat with Pakistani ISI agent Ali Hassan revealed

Jyoti Malhotra: పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరో సంచలన విషయం బయటపడింది. పాక్ ISI ఏజెంట్ అలీ హసన్‌తో ఆమె లవ్‌లో ఉన్నట్లు తేలింది. 'నన్ను పాక్‌లో పెళ్లి చేసుకో' అంటూ అతనికి ప్రపోజ్  చేసిన సీక్రెట్ చాట్ బయటపడింది.

కోడ్ రూపంలో చాటింగ్.. 

అలీతో ఆమె ఎమోషనల్‌ రిలేషన్ కలిగివుందని, ఇదే క్రమంలో భారత సైన్యానికి సంబంధించిన సమాచారం కూడా షేర్‌ చేసిందని పోలీసులు గుర్తించారు. అయితే కొన్ని సంభాషణలు గూఢచారి కార్యకలాపాలకు సంబంధించిన కోడ్ రూపంలో ఉన్నాయని నిర్ధారించారు. అలాగే జ్యోతి బ్యాంక్ లావాదేవీలను పరిశీలించగా.. నాలుగు బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఒక అకౌంట్‌కు దుబాయ్ నుంచి డబ్బులు వచ్చాయని, ప్రస్తుతం వాటిని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

 ఇది కూడా చూడండి: Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’ 

ఇక జ్యోతి డైరీలో తన పర్యటనలు అన్నింటి గురించి కూడా పొందుపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఇంగ్లీషు, హిందీలో ఆమె తన అనుభవాలను పంచుకుంది. అయితే డైరీని ఆమె ఆచితూచి రాసినట్లు పోలీసులు చెబుతున్నారు. పాకిస్తాన్ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆమె తన డైరీని ఇంగ్లీషులో కాకుండా హిందీలో రాసినట్లు పోలీసులు తెలిపారు. పాకిస్తాన్‌ పర్యటన 10 రోజులు పూర్తి అయిన తర్వాత సొంత దేశమైన భారత్‌కు తిరిగి వచ్చాను. జ్యోతి ఒక పేజీలో లవ్ యు ఖుష్ ముష్ అని రాసి ఉంది. ఆమె ఎవరి కోసం రాసిందనే విషయం ఇంకా తెలియదు. అలాగే సవితను పండ్లు తీసుకురమ్మని చెప్పు అని కూడా రాసి ఉంది. 

ఇది కూడా చూడండి:TG Crime : భర్త ఫోన్ కు అశ్లీల ఫోటోలు పంపిన కానిస్టేబుల్‌...! ఉరేసుకుని భార్య...

JYOTHI MALHOTRA | love | telugu-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు