/rtv/media/media_files/2025/07/02/the-bangladesh-lover-2025-07-02-13-53-05.jpg)
The Bangladesh Lover
Six Lovers : ప్రేమ అంటే ఒకప్పుడు ఒక ఎమోషన్. ఇప్పుడు దీనికి అర్థమే మారిపోయింది. ఇప్పుడు ప్రేమ ఒక బిజినెస్. ప్రేమ పేరుతో అమ్మాయిలను శారీరకంగా వాడుకోవడం అబ్బాయిలు చేస్తుంటే, అబ్బాయిల వద్ద వీలయినంత వసూలు చేసి వారిని బోల్తా కొట్టించడం అమ్మాయిలకు సర్వసాధాణమై పోయింది. ఇక ఆన్‌లైన్ ప్రేమలకు అంతే లేదు. కలిసి ఉన్నంతకాలం చాటింగ్,మీటింగ్, డేటింగ్ అన్నట్లుగా ఉండే అమ్మాయిలు ఆ తర్వాత చీటింగ్ చేస్తున్నారు.
ఇది కూడా చూడండి:Missing girl : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్ వైపు వెళ్లి.....
బంగ్లాదేశ్‌కు చెందిన అమ్మాయి తన ప్రేమ చాలా విశాలమైందని నిరూపించుకుంది. ఏకకాలంలో ఒకరు ఇద్దరు కాకుండా ఒకేసారి ఆరుగురు బాయ్‌ఫ్రెండ్స్‌ను మెయింటెన్ చేసింది. ఒకరికి తెలియకుండా ఒకరితో డేటింగ్ చేసింది. అందరూ ఆన్‌లైన్‌లో పరిచయం అయినవారే కావడం విశేషం. కాగా ఈ విషయం ఈ ఆరుగురిలో ఒకరికి తెలిసింది.తనతో పాటు మరో ఐదుగురిని ఆమె వాడుకుంటోందని గుర్తించాడు. దీంతో మిగతా వాళ్ల వివరాలు తెలుసుకుని తన ప్రేమతో పాటు వారి ప్రేమ కథలను పూర్తిగా వివరించాడు. దీంతో అందరూ కలిసి ఆమెకు షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఇది కూడా చూడండి:మహారాష్ట్రలో దారుణం.. నడి రోడ్డులో 17ఏళ్ల బాలికపై లైంగికదాడి!
ఒకరోజు ఆమెను ఒక హోటల్‌లో కలుద్దామని అందులో ఒకరు ఆమెను ఇన్వైట్ చేయగా.. అక్కడకు వచ్చింది అ లవర్. ఆమెకు సర్‌ప్రైజ్ ఇస్తానని కళ్లు మూశాడు ఆ ప్రియుడు. ఈ లోపు మిగిలిన ఐదుగురు కూడా ఒక్కసారిగా రూమ్‌లోకి ఎంటర్ అయ్యాక కళ్లు తెరిచాడు. ఇంకేముంది.. ఆ అమ్మాయి షాక్ అయింది. వారిని ఫేస్ చేయలేక ముఖం తిప్పుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.. ఆ తర్వాత మాత్రం ఏం జరుగుతుందనేది అందరికీ తెలిసిందే. సారీ చెప్పి.. తప్పుకుంటుంది.. మరో ఆరుగురు బకరాగాళ్లను పట్టుకుని తిరుగుతుందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి వారికి తగిన బుద్ది చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చూడండి:Sigachi Company: పాశమైలారం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం