/rtv/media/media_files/2025/07/05/mysore-lover-2025-07-05-14-36-17.jpg)
మైసూరులో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించమంటే ఒప్పుకోవడం లేదని దారుణానికి పాల్పడ్డాడు. ఓ యువతిని కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాండవపురానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ అభిషేక్ గత కొంతకాలంగా వెంటపడతున్నాడు. తనకు ఇష్టం లేదని యువతి తెగేసి చెప్పిన ఆమెను అభిషేక్ మరింతగా బలవంతం చేశాడు. తనను ప్రేమించాలంటూ శనివారం సాయంత్రం యువతిని మరోసారి బలవంత పెట్టాడు.అయితే ప్రేమించేందుకు నిరాకరించిన యువతి.. తన జోలికి రావొద్దని అభిషేక్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.
Also Read : అలాంటి వాళ్లు వెళ్లిపోండి.. సొంత పార్టీ నేతలకు బీజేపీ కొత్త చీఫ్ వార్నింగ్!
Also Read : భారీ అగ్నిప్రమాదం.. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న యువకుడు మృతి
వెంటతెచ్చుకున్న చాకుతో
దీంతో ఆగ్రహానికి గురైన అభిషేక్ తన వెంటతెచ్చుకున్న చాకుతో గట్టిగా పొడవడంతో యువతి స్పృహతప్పి పడిపోయింది. రక్తపు మడుగులో ఉన్న యువతి పట్ల అభిషేక్ దారుణంగా ప్రవర్తించాడు. ఆమె మెడలో తాళి కట్టి సెల్ఫీ తీసుకుని మురిసిపోయాడు. అనంతరం ఆమెను సమీపంలో ఓ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. బాధితురాలి కుటుంబ సభ్యుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అభిషేక్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
Also Read : ఆ ఒక్కడికి తప్పా అందరికీ కృతజ్ఞత ఉంది.. ఆర్పీపై రోజా షాకింగ్ కామెంట్స్!
Also Read : పెళ్లికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. వరుడితో సహా 8 మంది మృతి
killing | love | Mysore | karnataka