Lalit modi: మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా!

IPL సృష్టికర్త మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ 61 ఏళ్ల వయసులో మరో అందగత్తెతో ప్రేమలో పడ్డారు. లవర్స్ డే సందర్భంగా న్యూ లవర్‌ రిమ్ బౌరీని పరిచయం చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. 25 ఏళ్ల ఫ్రెండ్‌షిప్ ఇప్పుడు ప్రేమగా మారినందుకు తాను అదృష్టవంతుడినన్నారు.

New Update
lait modi

Lalit Modi introduced new girlfriend

Lalit modi: IPL సృష్టికర్త మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ 61 ఏళ్ల వయసులో మరో అందగత్తెతో ప్రేమలో పడ్డారు. లవర్స్ డే సందర్భంగా న్యూ లవర్‌ను పరిచయం చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. కొంతకాలంగా బాలీవుడ్‌ నటి, విశ్వసుందరి సుస్మితా సేన్‌తో ప్రేమయాణం నడిపిన మోదీ.. తాజాగా మరో యంగ్ లేడీతో డేటింగ్ చేస్తున్నట్లు తెలిపాడు.

రెండుసార్లు అదృష్టవంతుడిని..

ఈ మేరకు '25 ఏళ్ల ఫ్రెండ్‌షిప్ ఇప్పుడు ప్రేమగా మారింది. నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా ఒకసారే అదృష్టవంతులు అవుతారు. కానీ నేను రెండుసార్లు అదృష్టవంతుడిని. నా జీవితంలో రెండుసార్లు అద్భుతం జరిగింది. మీ అందరికీ కూడా జరుగుతుందని ఆశిస్తున్నా. అందరికీ #happyvalentinesday' అంటూ ఆమెతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా జనాలు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. 'వీడు మగాడ్రా బుజ్జీ. అదృష్టమంటే ఇలా ఉండాలి. ఆటగాడు' అంటూ పొగిడేస్తున్నారు. 

నిన్ను చాలా ప్రేమిస్తున్నా..

ఈ అందగత్తె పేరు రిమ్ బౌరీ. లెబనాన్‌లో స్థిరపడిన ఆమె ఇండిపెండెట్ కన్సల్టెంట్ అండ్ మార్కెటింగ్ నేపథ్యం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. లండన్‌లోని అమెరికన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రిచ్‌మండ్ నుండి మార్కెటింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. ఆమె ఇంగ్లీష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ భాషలలో నిష్ణాతులు. కాగా లలిత్ మోదీ తన ప్రియురాలు రీమాను ఇన్‌స్టాగ్రామ్‌లో 25 ఏళ్లుగా ఫాలో అవుతున్నారట. అయితే లలిత్ మోదీ ప్రేమపై స్పందించిన రిమ్ బౌరీ.. 'నిన్ను చాలా ప్రేమిస్తున్నాను' అంటూ తన ప్రేమను చాటుకుంది.

ఇది కూడా చదవండి: BIG BREAKING: ఎమ్మెల్యే చింతమనేనిపై సీఎం చంద్రబాబు సీరియస్!

ఇదిలా ఉంటే.. లిత్ మోడీ సతీమణి మిలాన్‌ మోడీ 2018లో క్యాన్సర్‌తో చనిపోయారు. ఇక మనీలాండరింగ్ కేసులో 2010లో దేశం విడిచి వెళ్లిన లలిత్ మోదీ ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నాడు. 2022లో సుస్మితా సేన్‌తో డేటింగ్‌ చేసిన ఆయన పెళ్లి కూడా చేసుకోబుతున్నట్లు చెప్పాడు. కానీ వీరి బంధం మధ్యలోనే తెగిపోయింది. అప్పట్లో వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేగింది. 2023లో సుష్మితా సేన్ లలిత్ మోడీతో తన స్వల్పకాలిక ప్రేమ గురించి ఆసక్తికర వ్యా్ఖ్యలు చేసింది. ఇది మరో దశ. అయినప్పటికీ ప్రజలు తనను 'గోల్డ్ డిగ్గర్' అని పిలవడం ఆనందమేనని పేర్కొంది. 

ఇది కూడా చదవండి: MP Highcourt: పరాయి పురుషుడితో అలా చేస్తే అక్రమ సంబంధం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు!

#lalit-modi #telugu-news-today #telugu-news #latest-telugu-news #valentines-day #rtv telugu news #love
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు