SI- Home Guard Affair: హోంగార్డుతో SI ఎఫైర్.. పెళ్లి పేరుతో కామవాంఛ తీర్చుకుని దారుణం!

పోలీస్ స్టేషన్‌లోనే దారుణం జరిగింది. ఒడిశా జగత్సింగ్‌పూర్ జిల్లాలో పెళ్లి చేసుకుంటానని ఓ ఎస్సై.. మహిళా హోంగార్డును శారీరకంగా వాడుకుని మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు డీజీపీ వైబీ ఖురానియా తెలిపారు.

New Update
police case

Si illicit relationship with female home guard

SI- Home Guard Affair: పెళ్లి చేసుకుంటానని ఒక మహిళా హోంగార్డుతో శారీరక సంబంధం పెట్టుకున్న ఎస్సై చివరికి దారుణానికి పాల్పడ్డాడు. ఒకే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించిన వారిద్దరు కొంతకాలం స్నేహంగా ఉండి ఆ తర్వా ప్రేమలో పడ్డారు. మరికొన్ని నెలల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే వారి ప్రేమ విషయం విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో కథ అడ్డం తిరిగింది. ఉన్నట్టుండి ఆ ఎస్సై మాట మార్చేశాడు. దీంతో లబోదిబోమంటూ సదరు మహిళా హోంగార్డు అధికారులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఒడిశాలో జరగగా వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్‌ రిలీఫ్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం

పెళ్లి అయిన విషయం దాచి దారుణం..

ఈ మేరకు ఒడిశా జగత్సింగ్‌పూర్ జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్ లో ఒక మహిళా హోమ్ గార్డ్‌, ఇన్‌స్పెక్టర్ పనిచేస్తున్నారు. వీరిమధ్య స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఈ సాకుతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే మహిళా హోమ్ గార్డు వెంటనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో అతను నిరాకరించాడు. దీంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. డిపార్ట్‌మెంట్ దర్యాప్తులో నిందితుడైన ఇన్‌స్పెక్టర్‌కు ఇప్పటికే వివాహం అయినట్లు బయటపడింది.

 Also Read: Dwaraka : కల వచ్చిందని శివలింగం దొంగతనం..వీడిన ద్వారకా మిస్టరీ

ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న డీజీపీ వైబీ ఖురానియా.. ఇన్‌స్పెక్టర్‌పై దుష్ప్రవర్తన, అధికారిక పదవిని దుర్వినియోగం చేసినందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాసేవ ప్రయోజనాల దృష్ట్యా ఇన్స్పెక్టర్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు డీజీపీ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు అమలులో ఉన్నంతవరకు నిందితుడు కటక్‌లోని సెంట్రల్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రమశిక్షణా నియంత్రణలో ఉంటాడని స్పష్టం చేశారు.

Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు! 

Also Read: HYD: పుప్పాలగూడలో అగ్నిప్రమాదం..పాపతో సహా ముగ్గురు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు