Dengue Fever: తెలంగాణ రాష్ట్రాన్ని విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, ఇతర విష జ్వరాల విజృంభణతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు నిండిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకే మంచం పై ఇద్దరు, ముగ్గురు రోగులకు చికిత్స అందిస్తుండగా…నగరంలోని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో అయితే బెడ్స్ లేవు. వేరే హాస్పిటల్స్ వెళ్లండనే బోర్డులు గేట్లకి దర్శనమిస్తున్నాయి. ఇక డెంగీ బాధిత చిన్నారులతో నిలోఫర్, గాంధీ, ఉస్మానియా, ఫీవర్ సహా జిల్లాల్లోని ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. బాధితుల్లో ఏడాదిన్నర నుంచి 12 ఏళ్ల వయసు పిల్లలు ఉంటున్నారు.
డెంగీ అయితే చాప కింద నీరులా ప్రవహిస్తోందని చెబుతున్నారు అధికారులు. ఈ ఏడాది మొత్తంలో 5,372 డెంగీ కేసులు నమోదు అయితే…అందులో నాలుగు వేల కేసులు కేవలం రెండు నెలల్లోనే నమోదయ్యాయని చెప్పారు. డెంగీ నిర్ధారణకు జరుపుతున్న పరీక్షల్లో 6.5 శాతం పాజిటివిటీ ఉంటోంది. ప్రతి 200 నమూనాల్లో 13 మందికి డెంగీ నిర్ధారణ అవుతోంది. తెలంగాణలో అత్యధికంగా హైదరాబాద్లో ఎక్కువ కేసులు నమోదు కాగా తర్వాతి స్థానాల్లో సూర్యాపేట, మేడ్చల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వరంగల్ లలో కూడా ఈ విషజ్వరం బారిన పడుతున్నారు. అయితే మరణాల శాతం మాత్రం తక్కువగానే ఉందని చెప్పారు. ఎక్కువగా చిన్న పిల్లలు డెంగీ బారిన పడుతున్నారు. దీ జ్వరానికి కారణమయిన టైగర్ ఓమ పగటి పూట మాత్రమే కుడుతుందని..దీంతో స్కూలుకు, బయటకు ఆడుకోవడానికి వెళ్ళిన పిల్లలు దోమకాటుకు గురవుతున్నారని చెప్పారు. అయితే దీనిని మొదటే గుర్తించలేకపోతున్నారు. బాగా ముదిరాక ఆసుపత్రికి తీసుకువస్తున్నారు. అలా కాకుండా రెండు రోజులు వరుసగా జ్వరం తగ్గకపోతే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని చెబుతున్నారు.
Also Read: MLC Kavitha: నేను మొండిదాన్ని.. జగమొండిని చేశారు: కవిత