GAZA: ఇజ్రాయెల్ దాడిలో విషాదం..తొమ్మిది మంది పిల్లలు ఒకేసారి..

గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక వైద్యురాలికి చెందిన తొమ్మిది మంది పిల్లలు ఒకేసారి మరణించారు. ఆమె మరొక కుమారుడు, భర్తకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. 

New Update
gaza

9 Kids died in IDF attack

గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు రోజుకు పదుల సంఖ్యలో పాలస్తీనియన్లు చనిపోతున్నారు. తాజాగా ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అలా నజ్జర్ అనే వైద్యురాలికి చెందిన తొమ్మిది మంది పిల్లలు ఒకేసారి మరణించారు. మరొక కుమారు, ఆమె భర్త కూడా తీవ్రంగా గాయాలపాలయ్యారు. వీరితో పాటూ గత రెండు రోజుల్లో 79 మంది మృతి చెందారని తెలుస్తోంది. నజ్జర్ ఖాన్‌ యూనిస్‌లోని నాస్సెర్‌ ఆసుపత్రిలో చిన్న పిల్లల వైద్యురాలిగా పని చేస్తున్నారు. ఆమె ఆసుపత్రిలో ఉండగా..ఇల్లు మంటల్లో కాలిపోతోందని సమాచారం వచ్చింది. దాంతో ఆమె వెళ్ళి చూడగా..నజ్జర్ 9మంది చిన్నారులు చనిపోయి కనిపించారు. నజ్జర్‌ భర్తతోపాటు మరో 11 ఏళ్ల కుమారుడు తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య ఉన్నారు. చనిపోయిన పిల్లలంతా 7 నెలల నుంచి 12 ఏళ్ల మధ్య వయసువారు. ఇద్దరు పిల్లలు శిథిలాల కింద నలిగిపోయారు. 

ఖాన్ యూనిస్ డేంజర్ జోన్..

ఈ ఘటనపై ఇజ్రాయెల్ దళాలు కూడా స్పందించాయి. తమ దళాలకు సమీపంలోని భవనంలో అనుమానిత మిలిటెంట్లు ఉన్నారన్న సమాచారంతో దాడి చేశామని తెలిపింది. ఱాన్ యూనిస్ ను డేంజర్ జోన్ గా ప్రకటించామని...అక్కడ ప్రజలతో ఇల్లు ఖాళీ చేయిస్తున్నామని ఐడీఎఫ్ తెలిపింది. పిల్లలపై జరిగిన దాడిని సమీక్షిస్తామని చెప్పింది. శుక్రవారం 100కు పైగా ప్రాంతాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ దళం తెలిపింది. 

 today-latest-news-in-telugu | gaza | israel-attack | kids

Also Read: MP: రోడ్డు మీదే శృంగారం..బీజేపీ నేత బరితెగింపు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు