Sabarmati Express: దేశంలో మరో రైలు ప్రమాదం జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు ట్రాక్‌పై బండరాయి ఎక్కడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు రైల్వే అధికారు తెలిపారు. కాసేపట్లో కాన్పూర్ స్టేషన్ వస్తుందనగా ప్రమాదం జరిగిందని, అప్పటికే రైలు స్లో కావడంతో పెను ప్రమాదం తప్పినట్లు చెప్పారు. దీంతో 20 బోగీలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై పోలీసులు, ఐబీ దర్యాప్తు చేపట్టాయి.
#WATCH | Kanpur, Uttar Pradesh: Sabarmati Express (Varanasi to Ahmedabad) derailed near Kanpur at 02:35 am today. The engine hit an object placed on the track and derailed. Sharp hit marks are observed. Evidence is protected, which was found near the 16th coach from the loco. As… pic.twitter.com/VaSFhweRL8
— ANI (@ANI) August 17, 2024
ఇటీవలి కాలంలో దేశంలో వరుస రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యం రైలు పట్టాలు తప్పిన ఘటనలు ప్రజలను భయందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే ఝార్ఖండ్ లో హౌరా ఎక్స్ ప్రెస్ 18 బోగీలు పట్టాలు తప్పి ఇద్దరు మరణించగా 5గురు గాయపడ్డారు. జూన్ లో పశ్చిమ బెంగాల్ లో ఓ గూడ్స్ రైలు- కాంచనగంగా ప్యాసింజర్ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 11మంది మరణించగా 60మందికి తీవ్ర గాయలయ్యాయి.
#WATCH | Uttar Pradesh | Train no. 19168, Sabarmati Express derailed near Kanpur at 02:35 am today after the engine hit an object placed on the track and derailed.
(Visuals from the spot) pic.twitter.com/GgonkJORgK
— ANI (@ANI) August 17, 2024
జులై 18న ఉత్తరప్రదేశ్‌లోని గోండా రైల్వే స్టేషన్లో మరో ప్రమాదం జరిగింది. చండీగఢ్-దిబ్రూగడ్ రైలుకు చెందిన 8 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మందికి పైగా గాయాలయ్యాయి. జులై 19న గుజరాత్లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వల్సడ్ నుంచి సూరత్ స్టేషన్ల మధ్య ఆ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జులై 21న ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అమ్రోహా మీదుగా ఢిల్లీ వైపు ఓ గూడ్స్ రైలు వెళ్తోంది. అలా వెళ్తుండగా అకస్మాత్తుగా మూడు బోగీలు బోల్తాపడ్డాయి. మరో మూడు బొగీలు పట్టాలు తప్పాయి.
Railway Minister Ashwini Vaishnaw tweets, “The engine of Sabarmati Express (Varanasi to Amdavad) hit an object placed on the track and derailed near Kanpur at 02:35 am today. Sharp hit marks are observed. Evidence is protected. IB and UP police are also working on it. No injuries… pic.twitter.com/4Gw1eosNR7
— ANI (@ANI) August 17, 2024
జులై 29న బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. దర్బంగ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా.. ఇంజిన్ నుంచి బోగీలు వీడిపోయాయి. ఇది గమనించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక జులై 30న జార్ఘండ్‌లోని బారాబంబో వద్ద రైలు పట్టాలు తప్పింది. హౌరా – ముంబై మెయిల్‌కు చెందిన రైలులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి.
Also Read : రుణమాఫీ ద్రోహం.. రైతుల పాలిట కాంగ్రెస్ శాపం: బీఆర్ఎస్ వినూత్న ప్రచారం