/rtv/media/media_files/2025/01/20/voxu9u4ZXTNGOhVA1Wj9.jpg)
kanpur sbi Photograph: (kanpur sbi )
షార్ట్ కట్ లో డబ్బు సంపాదించాలని అనుకున్నాడు ఓ యువకుడు. దొంగతనం (Theft) అనుభవం లేకపోవడంతో యూట్యూబ్‌ను నమ్ముకున్నాడు. డబ్బు ఎక్కువగా ఉండే బ్యాంకును దోచేస్తే సింగిల్ సిట్టింగ్ లో సెటిల్డ్ కావొచ్చని అనుకున్నాడు. బ్యాంకులో దొంగతనం ఎలా అని యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు చూశాడు. ఫైనల్ గా ఓ బ్యాంకుని ఫిక్స్ చేసుకుని దొంగతనానికి వెళ్తే చివరకు అడ్డంగా బుక్కైపోయి జైలు పాలయ్యాడు. ఇంతకీ ఏంటీ స్టోరీ ఇప్పుడు చూద్దాం.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని కాన్పూర్‌లోని బిఎస్‌సి చదువుతున్న లవిష్ మిశ్రా అనే ఓ విద్యార్థి పక్కా ప్లాన్ వేసుకుని కాన్పూర్‌లో ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) బ్యాంకును దోచుకోవాలని అనుకున్నాడు. బ్యాంకును ఒంటిచేత్తో దోచుకునేందుకు అరచేతి కింద సర్జికల్ బ్లేడ్‌ను బిగించి, తెరిచిన పిస్టల్, కత్తితో బ్యాంకులోకి ప్రవేశించాడు. అతన్ని సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడంతో అతనిపై కత్తితో దాడి చేశాడు లవిష్ . గార్డుపై దాడి చేస్తే, బ్యాంకు మొత్తం భయాందోళనలకు గురై అతని కంట్రోల్ లోకి వస్తుందనేది అతని ప్లాన్. అయితే తీవ్ర గాయాలైన సెక్యూరిటీ గార్డు ఆ యువకుడిపై మరింత ధైర్యాన్ని ప్రదర్శించి పట్టుకున్నాడు. బ్యా్ంకు సిబ్బంది కూడా అతనికి సహాయం చేసి పట్టుకుని యువకుడిని తాళ్లతో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read : అన్న వాట్సాప్‌కు తమ్ముడి న్యూడ్ ఫోటోలు..RTV చేతిలో సూసైడ్ నోట్!
Also Read : 30 లక్షల వీధి కుక్కలను చంపేందుకు సర్కార్ ప్లాన్.. ఆ ఈవెంట్ కోసమే!
SBI Bank Robbery In Uttar Pradesh
లవిష్ మిశ్రా ఒక రోజు ముందుగానే బ్యాంకుకు వచ్చాడని, అయితే పెద్ద సంఖ్యలో రద్దీ ఉండటంతో ఆ రోజు దొంగతనాన్ని విరమించుకున్నాడని ఏసీపీ రంజిత్ కుమార్ చెప్పారు. పోలీసుల విచారణలో యువకుడు ఒకటి, రెండు సార్లు బ్యా్ంకు రెక్కీ చేసినట్లు తేలింది. యువకుడి మొబైల్‌లో బ్యాంకు దోపిడీకి సంబంధించిన దాదాపు 50 వీడియోలను చూసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడు బ్యాంకును దోచుకోవాలని చాలా కాలంగా ప్లాన్ చేసుకున్నాడని, ఒక్కో వీడియోను చాలా జాగ్రత్తగా వీక్షించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.
నిందితుడు లవిష్ అరెస్ట్ తర్వాత తాను పట్టుబడ్డానన్న పశ్చాత్తాపం అతడి ముఖంలో కనిపించలేదు. నిందితుడి అన్నయ్య అభయ్ మిశ్రా ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా, అతని తండ్రి అవధేష్ మిశ్రా ఓ సాధారణ రైతు. పెద్దగా డబ్బున్న కుటుంబం కాదు. అయితే డబ్బులు అడిగినప్పుడు తనను ఏదో ఒక పని చేయమని తండ్రి చాలాసార్లు చెప్పేవాడని ఇది నచ్చక దొంగతనాలకు లవిష్ ప్లాన్ చేశాడు.
Also Read : Firing: అమెరికాలలో కాల్పులు.. హైదరాబాద్ విద్యార్థి మృతి
Also Read : వదినపై కన్నేసి.. అన్నకు కరెంట్ షాక్ ఇచ్చి ఎంత కృరంగా చంపాడంటే!?