Elephants In Chittoor District : చిత్తూరు జిల్లాలో ఏనుగులు (Elephants) హల్చల్ చేస్తోన్నాయి. సోమల మండలంలో ఏనుగుల గుంపు దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా 120 బాక్సులలో నిల్వ ఉంచిన టమోటా (Tomato) లను ఏనుగులు తొక్కి ధ్వంసం చేశాయి. దీంతో తనకు రూ. 2 లక్షలు నష్టం వచ్చిందని రైతు (Farmer) ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కాగా, గత కొన్ని రోజులుగా మండలంలో వరి, మామిడి, అరటి, కొబ్బరి చెట్లను ఏనుగులు గుంపు ధ్వంసం చేశాయి. అధికారులు ఏనుగుల దాడులను అరికట్టాలని రైతున్నలు వేడుకుంటున్నారు.
Also Read: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటనపై చంద్రబాబు సీరియస్..!