/rtv/media/media_files/2025/01/18/cqRDJc4K18i7UpqzlvWe.jpg)
death
ఆదిలాబాద్ పట్టణంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బ్యాంకు అధికారుల వేధింపులు తాళలేక ఓ రైతు బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పురుగులమందు తాగి ఆ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బేల మండలం రేణిగూడ గ్రామానికి చెందిన జాదవ్ దేవరావు అనే రైతు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతడు ఐసీఐసీఐ బ్యాంకులో అవసరాల నిమిత్తం లోన్ తీసుకున్నాడు.
Also Read : Mohammed Siraj: పాపం సిరాజ్.. ఛాంపియన్స్ ట్రోఫీలో దక్కని చోటు
కానీ పలు కారణాల వల్ల అప్పును తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో బ్యాంకు సిబ్బంది దేవరావును లోన్ తీసుకున్న డబ్బులు కట్టాలంటూ పదేపదే అడుగుతుండేవారు. ఇంతలోనే తాజాగా బ్యాంకుకు వచ్చిన ఆ రైతు బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంకు సిబ్బంది నిత్యం దేవరావును వేధింపులకు గురిచేశారని అతడి బంధువులు చెబుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలాఉండగా గతంలో కూడా ఇలా బ్యాంకు నుంచి అప్పు తీసుకొని అధికారుల వేధింపులు తాళలేక పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి.
Also Read : మెడికల్ స్టూడెంట్ పై హత్యాచారం చేసింది అతడే.. కోల్‌కతా కోర్టు సంచలన తీర్పు!
Also Read: ఇజ్రాయెల్- హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం..హెజ్‌బొల్లా ఏం చెప్పిందంటే ?