Chinmayi: టాలీవుడ్ ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా కనిపిస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా సమాజంలో మహిళల పట్ల జరిగే అన్యాయాలు, సామజిక అంశాల పై తనదైన శైలిలో వాయిస్ రైజ్ చేస్తుంటారు. అయితే తాజాగా ఓ టీవీ హోస్ట్ ను ఉద్దేశిస్తూ చిన్మయి చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.
చిన్మయి పోస్ట్
సింగర్ చిన్మయి తన పోస్ట్ లో ఇలా పేర్కొంది.. “తల్లిదండ్రులు, ప్రేక్షకులు ఉత్సాహపరుస్తున్నప్పుడు.. ఓ మహిళా హోస్ట్ పిల్లవాడిని తన నోటిపై ముద్దు పెట్టమని అడగడం చూడటం జరిగింది. ఇలాంటివి పిల్లల పై చాలా ప్రభావం చూపుతాయి. దీని వల్ల పిల్లలు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య వ్యత్యాసం గురించి కన్ఫ్యూజ్ అవుతారు. పిల్లలతో టీవీ/కామెడీ షోలు చేస్తున్న కంటెంట్ భయానకంగా ఉంది. పిల్లలకు సురక్షితమైన బాల్యాన్ని అందించాలనుకునే ఏ సమాజంలోనైనా ఇది ఆమోదయోగ్యం కాదని ఆమె పోస్ట్ లో రియాక్ట్ అయ్యింది”.
View this post on Instagram
అనసూయను ఉద్దేశించా..?
కాగా, ఈ పోస్ట్ పరోక్షంగా యాంకర్ అనసూయను ఉద్దేశించినట్లుగా ఉంది. రీసెంట్ గా ఓ టీవీ షోకి అటెంటెడైన అనసూయ.. ఆ షోలో పిల్లవాడిని ఎత్తుకొని మొహం, చెంపలు.. ఆ తర్వాత లిప్స్ పై కిస్ పెట్టమని అడుగుతుంది. ఆ చిన్నబాబు కూడా పెడతాడు. ఈ వీడియో నెట్టింట ఫుల్ వైరల్గా మారింది. దీంతో ఓ టీవీ హోస్ట్ అంటూ చిన్మయి చేసిన పోస్ట్ చూస్తుంటే అనసూయకు ఉద్దేశించే అన్నట్లుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Dear Tollywood @IamSaiDharamTej @HeroManoj1 ,
Please take action on Anasuya gaaru.
Please file POCSO act on her.
pic.twitter.com/hHthchERSU— యుగపురుషుడు (@PottiPotato95) July 25, 2024
Also Read: Aakasam Lo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ మూవీ.. పోస్టర్ వైరల్..! – Rtvlive.com