Anasuya : ఛాన్సుల పేరుతో  పక్కలోకి రమ్మన్నారు.. అనసూయ సంచలన కామెంట్స్

సినిమా ఛాన్స్‌ల పేరుతో వాడుకునేందకు హీరోలు, దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తూ ఉంటారని యాంకర్, నటి అనసూయ భరద్వాజ్‌ సంచలన కామెంట్స్  చేశారు. ఇలాంటిది తన విషయంలో కూడా జరిగిందని వెల్లడించారు. ఓ స్టార్ హీరో, డైరెక్టర్ తనని ఇలాగే అడిగితే  నో చెప్పానంది.

New Update
Anasuya Bharadwaj opens up

Anasuya Bharadwaj

సినిమా ఛాన్స్‌ల పేరుతో వాడుకునేందకు హీరోలు, దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తూ ఉంటారని యాంకర్, నటి అనసూయ భరద్వాజ్‌ సంచలన కామెంట్స్  చేశారు. ఇలాంటిది తన విషయంలో కూడా జరిగిందని వెల్లడించారు. ఓ స్టార్ హీరో తనని ఇలాగే అడిగితే  నో చెప్పానని.. ఓ స్టార్ డైరెక్టర్ అడిగితే కూడా సింపుల్ గా రిజెక్ట్ చేశానని తెలిపింది.  దీనివల్ల తనకు సినిమా అవకాశాలు తగ్గాయని వెల్లడించింది అనసూయ.  

ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయని చెప్పిన అనసూయ..  అలాంటివాటికి నో చెప్పడం లేదా ఎదురుకునే ధైర్యం ఉండాలని తెలిపింది.  ఇటీవలే ఓ యూట్యూబ్ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఆమె ఈ కామెంట్స్ చేశారు. ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే అ హీరో, డైరెక్టర్ ఎవరనేది మాత్రం అనసూయ బయటపెట్టలేదు.  

తాను హై స్కూల్ లో చదువుకునే టైమ్ లో చాలా ప్రపోజల్స్ వచ్చాయని వాటిని ఎలాగైతే రిజెక్ట్ చేశానో ఇండస్ట్రీకి వచ్చాక కూడా కమిట్ మెంట్స్ అడిగితే అలాగే నో  చెప్పానని అంది అనసూయ. అమ్మాయిలను లోబర్చుకునే  అవకాశాలు ఇవ్వడం కన్నా... కళ పరంగా చూసి అవకాశాలు ఇస్తే అప్పుడే చాలా మంది అమ్మాయిలు ఈ ఇండస్ట్రీకి  వస్తారని చెప్పుకొచ్చింది.  అ అమ్మాయి మనదగ్గరికి రాకపోతే ఏంటీ మనం రాసిన, ఇచ్చిన  పాత్రను బాగానే చేస్తుంది కదా అని దర్శకనిర్మాతలు అనుకోవాలని సూచించింది.  

మొత్తం విప్పి తిరుగాలా

ఇక సోషల్ మీడియాలో తన ఫోటోలపై వచ్చే కామెంట్స్ పై కూడా అనసూయ స్పందించింది.  తనను ఇష్టపడేవాళ్ల కోసం ఇన్ స్టాలో ఎలాంటి ఫోటోలు అయినా షేర్‌ చేస్తానని తెలిపింది. అయినా తాను ఎలాంటి  డ్రెస్‌ వేసుకోవాలి? బికినీ వేసుకోవాలా లేదంటే మొత్తం విప్పి తిరుగాలా అనేది తన ఇష్టమంది. అయిన తనపై మీ పెత్తనం ఏంటని నెటిజన్లపై ఫైర్ అయింది. తన వల్ల ఎవరూ ఇబ్బంది పడటం లేదన్న అనసూయ..  నెగెటివ్‌ కామెంట్స్‌ పెట్టడం వల్ల తాను ఇబ్బంది పడుతున్నాని వెల్లడించింది. 

Also Read :  పీరియడ్స్ లో మూడ్ స్వింగ్స్ ఎక్కువయ్యాయా..? ఈ సింపుల్ టిప్స్ తో అంతా సెట్

Advertisment
తాజా కథనాలు