Akkineni Akhil New Movie Update : అక్కినేని అఖిల్ (Akkineni Akhil) హీరోగా నటించిన ‘ఏజెంట్’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది ఏప్రిల్ 28 న భారీ అంచనాల నడుమ విడుదలై అఖిల్ కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. సినిమా వచ్చి ఏడాదికి పైగా కావస్తున్న అఖిల్ ఇప్పటిదాకా తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రకటించనేలేదు. ఆ మధ్య కొత్త దర్శకుడు అనిల్ కుమార్‌తో యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలొచ్చాయి.
ప్రస్తుతం అది పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు హీరో నాగార్జున (Nagarjuna) కూడా తన తనయుడు అఖిల్ కోసం మంచి కథను వెతికి పట్టుకునేందుకు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిశోర్ తన కథతో నాగ్‌ను మెప్పించినట్లు సమాచారం.
Also Read : వాళ్ళతో కలిసి ‘కల్కి’ చూడాలని ఉంది.. అమితాబ్ బచ్చన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇది చిత్తూరు నేపథ్యంలో సాగే ఓ రూరల్ డ్రామా కథగా ఉండనుందని.. అఖిల్‌కు సరిగ్గా సరిపోయేలా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై నాగ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఆయన దీన్ని తమ సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) లో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు.