Akhil6: అఖిల్ అక్కినేని కొత్త సినిమా పోస్టర్ ఊరమాస్.. చూస్తే గూస్‌ బంప్సే!

అక్కినేని అఖిల్ కొత్త సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది.

New Update
akhil akkineni new movie poster released

akhil akkineni new movie poster released

అకినేని అఖిల్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అతడు తన కెరీర్‌లో 6వ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్‌ డే. ఈ సందర్భంగా ఈ కొత్త సినిమాకు సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. 

Also read :  బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలో తులం రూ.56 వేలకు?

ఏప్రిల్ 8న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తు్న్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో అఖిల్ ఫేస్ కనిపించకుండా చూపించిన లుక్ అదిరిపోయింది. ఆ పోస్టర్‌పై ‘‘నో వార్.. ఈజ్ మోర్.. వైలెంట్ థెన్ లవ్’’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. దీనిబట్టి చూస్తే అఖిల్ ఈ సారి పవర్ ఫుల్ లుక్కులో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 

Also read : ఏడడుగుల కండక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి బంపరాఫర్!

ఇదిలా ఉంటే గతకొంతకాలంగా ఈ హీరోకి బ్యాడ్ టైం నడుస్తుంది. చేసిన ఏ సినిమా హిట్‌గా నిలవలేదు. అఖిల్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో.. ఆ తర్వాత హలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మజ్ను, ఏంజెంట్ వంటి చిత్రాలు చేశాడు. కానీ ఇవేవి అఖిల్‌కు మంచి హిట్‌ను అందించలేకపోయాయి. 

అతడి చివరి సినిమా ‘ఏజెంట్’ ఎన్నో అంచనాలతో రెండేళ్ల కిందట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసి డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ రిజల్ట్‌తో అఖిల్ రెండేళ్లు స్క్రీన్‌పై కనిపించలేదు. అయితే ప్రస్తుతం అతడు ఒక మంచి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇందులో బాగంగానే కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

Also read : ఒవైసీ బ్రదర్స్‌ను కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్

రెండేళ్ల తర్వాత కొత్త సినిమా

ఎట్టకేలకు అతడు ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్రం పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో రూరల్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనంతపురం రూరల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా స్టోరీ ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి ‘లెనిన్’ అనే పేరును టైటిగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

(Short News | Latest News In Telugu | సినిమా)

Advertisment
తాజా కథనాలు