Akkineni Akhil: కాబోయే భార్యతో అఖిల్ వెకేషన్.. బీచ్ సైడ్ ఫొటో వైరల్!

అఖిల్ తన కాబోయే భార్య జైనాబ్ తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరూ బీచ్ సైడ్ దిగిన ఫొటో నెట్టింట వైరలవుతోంది. ఈఫొటోకు 'నువ్వే నా సర్వస్వసం' అని క్యాప్షన్ కూడా జోడించారు. ఇది చూసిన అక్కినేని ఫ్యాన్స్ చూడముచ్చటగా ఉన్నారంటూ తెగ పొగిడేస్తున్నారు. 

New Update
Akhil Akkineni with fiancée zainab

Akhil Akkineni with fiancée zainab

Akkineni Akhil:  మరికొద్దీ రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న అఖిల్ అక్కినేని .. ప్రస్తుతం తన కాబోయే భార్యతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. కాబోయే భార్య జైనాబ్ తో కలిసి అఖిల్ బీచ్ సైడ్ దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అంతే కాదు ఫొటోకు ''నువ్వే నా సర్వస్వసం'' అని క్యాప్షన్ కూడా జోడించారు. ఈ ఫొటో నెటిజన్లను ఎంతగానో అకట్టుకుంటుంది. ఇది చూసిన అక్కినేని అభిమానులు ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారంటూ తెగ పొగిడేస్తున్నారు. 

Also Read: టాప్ సీక్రెట్ బయటపెట్టిన మిల్కీబ్యూటీ..

గతేడాది డిసెంబర్ లో నిశ్చితర్థం

అఖిల్ జైనాబ్ గతేడాది డిసెంబర్ లో నిశ్చితర్థం చేసుకున్నారు. త్వరలోనె  వీరి పెళ్లి డేట్ కూడా అనౌన్స్ చేయనున్నట్లు  ప్రచారం జరుగుతోంది. అయితే నాగ చైతన్య - శోభిత మాదిరిగానే అఖిల్ వివాహం కూడా అన్నపూర్ణ స్టూడియాలో అక్కినేని నాగేశ్వర్ రావు ఆశీస్సులతో జరపాలని ప్లాన్ చేస్తున్నారట నాగార్జున . అఖిల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి జైనాబ్ ఆర్టిస్ట్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్. ఆమె వేసిన పేంటింగ్స్ ఇంటర్ నేషనల్ స్థాయిలో ప్రశంసలు పొందాయి. అలాగే ఆమె తండ్రి జుల్ఫీ రావ్‌డ్జీ మంచి పేరున్న వ్యాపార వేత్త.  చిత్ర నిర్మాణ పరిశ్రమలోనూ ఆయనకు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. దీంతో పాటు జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సలహాదారుడిగా కూడా విధులు నిర్వహించారని సమాచారం. 

Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?

'లెనిన్' తో కొత్తగా

ఇదిలా ఉంటే.. ఏజెంట్ సినిమతో భారీ డిజస్టర్ మూటకట్టుకున్న అఖిల్.. కేరెర్ లో మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే రెండేళ్ల గ్యాప్ తీసుకొని.. 'లెనిన్ ' అనే ప్రయోగాత్మక సినిమతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవలే అఖిల్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు రొమాంటిక్, స్టైలిష్ పాత్రలు చేసిన అఖిల్.. ఇందులో పూర్తి భిన్నంగా కనిపించబోతున్నారు. పక్కా పల్లెటూరి అబ్బాయిగా మాస్ అవతార్ లో కనిపించాడు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఈసారి బొమ్మ హిట్టు అంటూ ఫుల్ ఖుషీ అవుతున్నారు.  గ్రామీణ ప్రాంతం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. 'వినరో భాగ్యం విష్ణు కథ' ఫేమ్ మురళీ కిషోర్ దర్శకత్వం వహిస్తుండగా .. అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు.  

Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..

cinema-news | latest-news | akkineni-akhil | Akkineni Akhil Marriage 

Also Read: Allu Ajun-Atlee: కాపీరైట్ వివాదం..అల్లు అర్జున్, అట్లీ మూవీకి బిగ్ షాక్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు