/rtv/media/media_files/2024/11/26/akhil-4.jpg)
akhil marriage
Akkineni Akhil Marriage: అక్కినేని కుటుంబంలో త్వరలో మళ్ళీ పెళ్లి భాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. నాగార్జున చిన్నకుమారుడు అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ నివేదిక ప్రకారం అఖిల్, జైనబ్ ఈ ఏడాది మార్చి 24న వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. గతేడాది నవంబర్ 26న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో అఖిల్- జైనాబ్ నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే నాగచైతన్య మాదిరిగానే అఖిల్ వివాహం కూడా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్థూడియోలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్థూడియోస్ లో వివాహ వేడుకల అనంతరం.. ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకోబోతున్నట్లు టాక్. అయితే పెళ్లి తేదీ, వేదికకు సంబంధించి ఇఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గా
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన జైనాబ్ ముంబయిలో స్థిరపడ్డట్లు సమాచారం. జైనాబ్ తండ్రి జుల్ఫీతో .. నాగార్జునకు కొన్నేళ్లుగా మంచి స్నేహం ఉందట. ఆ విధంగా ఏర్పడిన అఖిల్ , జైనాబ్ స్నేహం.. ప్రేమగా మారిందని టాక్. చిత్రకారిణి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గా జైనబ్ కి మంచి పేరుంది. మన దేశంలోనే కాక దుబాయ్, లండన్ లోనూ ప్రదర్శనలిచినట్లు తెలిసింది. జైనాబ్ తండ్రి జుల్ఫీ రావ్‌డ్జీ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా పనిచేసినట్లు సమాచారం. అంతేకాకుండా మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలు అందించినట్లు తెలుస్తోంది.
Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?
ఇది ఇలా ఉంటే గతేడాది డిసెంబర్ 4న అన్నపూర్ణ స్థూడియోస్ లోని ఏఎన్నార్ విగ్రహం ముందు నాగచైతన్య- శోభిత పెళ్లి ఘనంగా జరిగింది. చై- శోభిత పెళ్ళికి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు, రాజకీయ నాయకులతో సహా 300 మందికి పైగా గెస్టులు హాజరు అయ్యారు.
Also Read: ఇండియన్ ఆర్మీ వరల్డ్ రికార్డ్ !.. 40 మంది, 20 ఫీట్ల ఎత్తులో రైడింగ్