/rtv/media/media_files/2025/03/05/51lXdS6CA6BCaz87EEy1.jpg)
akkineni akhil agent movie streaming soniliv on march 14th
Agent OTT Date
అక్కినేని అఖిల్ హీరోగా.. భారీ బడ్జెట్‌తో వచ్చిన చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్నో అంచనాలతో ఈ సినిమా తెరకెక్కింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలింది. దాదాపు రూ.70 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకరకు పెద్ద దెబ్బే పడింది. కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సినిమా డిజాస్టర్‌తో నిర్మాత అనిల్ సుంకర కోలుకోలేకపోయాడు.
Also Read : చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?
ఇప్పటికీ ఈ మూవీ చేసిన గాయాన్ని అతడు మర్చిపోలేదు. అఖిల్ కెరీర్‌లోనే ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. ఈ దెబ్బతో అఖిల్ మరో సినిమా చేయలేదు. దాదాపు రెండేళ్లు గడుస్తున్నా.. ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే ఈ మూవీ థియేటర్లలో ఆకట్టుకోనప్పటికీ ఓటీటీలో చూద్దాం అని చాలా మంది సినీ ప్రియులు భావించారు.
Also Read : మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కానీ ఈ చిత్రానికి ఓటీటీలోనూ ఇబ్బందులు తప్పలేదు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీ లివ్ ఈ చిత్రాన్ని భారీ ధరకు కొనుగోలు చేసింది. సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్లలో కాస్త ఫ్లాప్ టాక్ వస్తే.. కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ ఈ సినిమా మాత్రం రెండేళ్లు దాటినా ఓటీటీలోకి నోచుకోలేదు. గతంలో ఓసారి రిలీజ్ చేస్తున్నామంటూ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అనౌన్స్ చేసింది. 2024 సెప్టెంబర్ 29న స్ట్రీమింగ్ చేస్తామని వెల్లడించింది. మళ్లీ ఏమైందో ఏమో కానీ అప్పుడు కూడా స్ట్రీమింగ్‌కు రాలేదు.
Finally Akhil Akkineni's #Agent Premieres Digitally on #SonyLIV from March 14! pic.twitter.com/t8B73wEzOJ
— TELUGUCINEMAS.IN (@TelugucinemasIn) March 5, 2025
Also Read : ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..
ఓటీటీ డేట్ ఇదే
దీంతో అయ్యగారి ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఫైనల్‌గా ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 14 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా ఆ ఓటీటీ సంస్థ వెల్లడించింది. చూడాలి మరి ఇప్పుడు ఏమైనా ఓటీటీలో ఏజెంట్ ఆకట్టుకుంటుందా? లేదా అని.
Also Read : అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం