Akkineni Akhil : అక్కినేని అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్ .. ఎప్పుడు, ఎక్కడంటే?

అక్కినేని హీరో అఖిల్ పెళ్లి ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.  2025 జూలై 06వ తేదీన పెళ్లి జరగనున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. జైనాబ్ రావ్జీతో అఖిల్ ఎంగేజ్ మెంట్ 2024 నవంబర్ 26న జరిగింది.

New Update
akhil akkineni marriage

Akkineni Akhil : అక్కినేని హీరో అఖిల్ పెళ్లి ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.  2025 జూలై 06వ తేదీన పెళ్లి జరగనున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. జైనాబ్ రావ్జీతో అఖిల్ ఎంగేజ్ మెంట్ 2024 నవంబర్ 26న జరిగింది. పెళ్లి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుందని  సమాచారం. ఇప్పటికే నాగచైతన్య, శోభితల వివాహం కూడా అందులోనే జరగడంతో వీరి వివాహం కూడా అక్కడే జరగనుందని సమాచారం. ఈ వివాహానికి అక్కినేని బంధువులు, సన్నిహితులతో పాటుగా ఇతర సినీ ఇండస్ట్రీల నుంచి పెద్ద ఎత్తున అతిథులు కూడా వచ్చే అవకాశం ఉంది.

Also Read: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

Also Read: Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

అఖిల్ సినిమాతో ఇండస్ట్రీలోకి

ఇదిలావుండగా అఖిల్ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా ఏంట్రీ ఇచ్చిన ఈ అఖినేని హీరో సరైన హిట్టు కోసం బాగా ట్రై చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం అఖిల్ వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఫేమ్  డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నలెనిన్  సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.  అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా గతంలో అఖిల్ ఓ అమ్మయితో ఎంగేజ్ మెంట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే.

Also Read: BIG BREAKING: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !

Also Read: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్

akkineni-akhil | Akkineni Akhil Marriage | annapurna-studios | hyderabad

Advertisment
Advertisment
తాజా కథనాలు