Actress Janhvi kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేశ వ్యాప్తంగా నేడు రక్షా బంధన్ వేడుకసలు అంగరంగా వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
తమ అన్నలు, తమ్ముళ్లకు రాఖీలు కట్టి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా రాఖీ పండగ సందర్భంగా ఆమె ఓ అభిమాని చేతికి రాఖీ కట్టడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముంబైలోని ఓ షూటింగ్ స్పాట్లో జాన్వీ చూసేందుకు అభిమానులు వచ్చారు.
Wonderful!#JanhviKapoor celebrates #RakshaBandhan with a fan. 🤍#FilmfareLens pic.twitter.com/3rKmRQQAf2
— Filmfare (@filmfare) August 19, 2024
Also Read : సుహాస్ ‘జనక అయితే గనక’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
అక్కడ ఓ అభిమాని రాఖీ పట్టుకుని వచ్చి, తనకు కట్టవలసిందిగా జాన్వీని కోరాడు. దీనికి ఆమె ఒప్పుకుని, అతని చేతికి రాఖీ కట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన ‘దేవర’ మూవీలో నటిస్తోంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది.