/rtv/media/media_files/puQVf9AXWsLmjEkmmT5e.jpg)
Devara Premiere Show Cancelled : జూనీయర్ ఎన్టీఆర్ 'దేవర' ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి భ్రమరాంబ మల్లికార్జున థియేటర్లో 'దేవర' ప్రీమియర్ షో రద్దు చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. రెండు థియేటర్లు కలిపి టికెట్స్ అన్నీ మేమే కొంటాం అంటూ కొంతమంది డిమాండ్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అన్ని టికెట్స్ ఒకరికే ఇవ్వడం కుదరదని, ఫాన్స్‌కు తాము టికెట్స్ అమ్మాలనుకుంటున్నట్లు థియేటర్ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో టికెట్ల వ్యవహారంపై వివాదం మొదలవగా ప్రీమియర్ షో రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటించిన 'దేవర' సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
His Presence is a Celebration of Havoc 🔥https://t.co/EA6VE0R5Sz
— Devara (@DevaraMovie) August 16, 2024
The HUNT will be more brutal than ever 🤙🏻#Devara #DevaraOnSep27th pic.twitter.com/4on5OFHHWW
Also Read : శృంగారం, డ్రగ్స్, బ్లాక్ మెయిల్స్.. కంపుకొడుతున్న తెలుగు ఇండస్ట్రీ!