Chuttamalle: NTR ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. చుట్టమల్లె సాంగ్ వచ్చేసింది ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన చిత్రం ‘దేవర’. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా నవంబర్ 8న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దేవర సినిమా నుంచి చుట్టమల్లే అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. By Seetha Ram 26 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో తెరకెక్కింది. ఫస్ట్ నుంచి పోస్టర్లు, టీజర్, సాంగ్, ట్రైలర్‌తో బజ్ క్రియేట్ చేసిన దేవర సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్.. తప్పిన పదవి గండం! ఫస్ట్ షో నుంచి మంచి రెస్పాన్స్‌తో నందమూరి అభిమానులను, సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అంతేకాకుండా బాక్సాపీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా 16 రోజుల్లో రూ.500 కోట్లు కొల్లగొట్టింది. ఇక దేవర సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన రేపటికి నెల కావొస్తుంది. ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ సర్కార్‌కు ఊహించని షాక్! నవంబర్ 8న స్ట్రీమింగ్ దీంతో ఓటీటీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. నవంబర్ 8న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లో ఏకకాలంలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ సినిమా కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇది కూడా చదవండి: వైసీపీ నేత సజ్జల అరెస్ట్‌పై కోర్టు కీలక తీర్పు! చుట్టమల్లే సాంగ్ ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ఓ ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులోని చుట్టమల్లే చుట్టేసిందే.. అనే సాంగ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడీ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. ఇది కూడా చదవండి: నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు: కేటీఆర్ ఈ సాంగ్‌లో జాన్వీ హాట్ హాట్ అందాలు సినీ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టున్నాయి. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి. #actress-janhvi-kapoor #chuttamalle-song #devara #ntr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి