/rtv/media/media_files/2024/12/07/QFREL1caqEAxssJr0zyn.jpg)
అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2' ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటూ నార్త్ ఆడియన్స్ సైతం ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే బాలీవుడ్‌లో కొందరు ఈ మూవీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
'పుష్ప2' కి అక్కడ ఎక్కువ థియేటర్స్ కేటాయించడంతో పలువురు అభ్యంతరం తెలుపుతున్నారు. 'పుష్ప2' వల్ల హాలీవుడ్ హిట్ మూవీ 'ఇంటర్ స్టెల్లార్' రీ రిలీజ్ వాయిదా పడిందని 'పుష్ప'ను విమర్శిస్తూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. తాజాగా దీనిపై బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ రియాక్ట్ అవుతూ 'పుష్ప2' మూవీకి సపోర్ట్ చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
ఇది కూడా చూడండి: Farmer suicide: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య
HUGE RESPECT for you #JanhviKapoor !!!! ❤️🔥❤️🔥❤️🔥
— Pandu (@pandu_gadu18) December 6, 2024
Rest all intellectuals, meeru moxxa kudandi, meeku aa english cinema nunchi oka mukka kuda raadu kaani sollu maatram cheptaru. #PushpaTheWildFire
Huge W to this woman,spoke out what was right!!! pic.twitter.com/HeZ1pK0sLe
Also Read : డబ్బులు తక్కువిచ్చినా పర్లేదు కానీ ఫ్రీగా ఆ పని చేయను.. రష్మిక షాకింగ్ కామెంట్స్
చిన్న చూపు ఎందుకు..?
' పుష్ప2 కూడా సినిమానే కదా.. పాశ్చాత్య దేశాలకు చెందిన సినిమాలతో పోలుస్తూ మన సినిమాను ఎందుకు తక్కువ చేస్తున్నారు. మన సినిమాలను గుర్తించకుండా ఇతర దేశ సినిమాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రస్తుతం మీరు సపోర్ట్ చేస్తున్న హాలీవుడ్ వారే మన సినిమాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మన సినిమా పట్ల ఆకర్షితులవుతున్నారు. అయితే, ఇక్కడ విచారకరం ఏమిటంటే.. మనం మాత్రమే మన సినిమాలపై చిన్న చూపు చూపిస్తున్నాం..' అంటూ పోస్ట్ లో పేర్కొంది. దీంతో జాన్వీ పోస్ట్ పై బన్నీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : సంధ్య థియేటర్ ఘటనపై ఎట్టకేలకు స్పందించిన బన్నీ.. బాధిత కుటుంబానికి 25 లక్షల సాయం
ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు