Kanguva Trailer: తమిళ్ స్టార్ సూర్య (Actor Surya) హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కంగువా’. ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్, UV క్రియేషన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కథానాయికగా నటించగా.. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ (Bobby Deol) విలన్ గా నటించారు. జగపతి బాబు, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, కేఎస్ రవికుమార్, కోవై సరళ కీలక పాత్రలు పోషించారు.
కంగువా ట్రైలర్
తాజాగా దర్శకుడు శివ పుట్టినరోజు సందర్భంగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ లోని విజువల్స్, యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ చూస్తుంటే మరో రికార్డు బ్రేకింగ్ సినిమాగా కంగువా ఉండబోతున్నట్లు అర్ధమవుతుంది.
“ఈ దీవిలో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.. కానీ అన్నింటి కంటే మించిన రహస్యం ఇది” అనే డైలాగ్స్ ట్రైలర్ మొదలవుతుంది. రెండు తెగల మధ్య జరిగే పోరాటంగా ఈ ట్రైలర్ కనిపించింది. ఒక తెగకు సూర్య, మరో తెగకు బాబీ డియోల్ నాయకులుగా చూపించారు. ట్రైలర్ లో సూర్య ఎంట్రీ సీన్, లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ మూవీలో సూర్య, బాబీ డియోల్ మధ్య అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సెస్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రం తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీతో పాటు ఇంగ్లీష్ పలు ఇతర భాషల్లోనూ రిలీజ్ కాబోతుంది.
Also Read: Vishwak Sen: ‘VS13’ నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసిన విశ్వక్.. పోస్టర్ వైరల్ – Rtvlive.com