Suriya: 'సింగం4' కి సిద్దమవుతున్న సూర్య.. కూతురి గ్రాడ్యుయేషన్ సెర్మనీ ఫొటోతో హింట్!

కూతురు గ్రాడ్యుయేషన్ సెర్మనీ ఫొటోల్లో హీరో సూర్య లుక్ నెట్టింట వైరలవుతోంది. ఈ ఫొటోల్లో సూర్య లుక్ 'సింగం' సినిమా పాత్రకు చాలా దగ్గరగా ఉంది. దీంతో సూర్య 'సింగం 4' కి సిద్దమవుతున్నారా? అంటూ నెట్టింట చర్చ మొదలైంది.

New Update
suriya singam 4

suriya singam 4

Suriya Singam4:  కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవలే తన కూతురు స్కూల్  గ్రాడ్యుయేషన్ వేడుకల్లో దిగిన ఫొటోలతో మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈ ఫొటోలను ఆయన భార్య జ్యోతిక ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అందులో సూర్య లుక్  సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Also Read: Miss World 2025: ప్రపంచం చూపులన్నీ HITEX మీదే! ఈరోజు గ్రాండ్ ఫినాలే హైలైట్స్ ఇవే

సూర్య సింగం 4

అయితే  ఈ లుక్  'సింగం' సినిమా పాత్రకు చాలా దగ్గరగా ఉంది. దీంతో సూర్య  'సింగం 4'  కి సిద్దమవుతున్నారా? అంటూ నెట్టింట చర్చ మొదలైంది. జ్యోతిక ఈ ఫొటో షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే డిలీట్ చేశారు. కానీ ఫ్యాన్స్ అంతలోపే లుక్ ని గుర్తుపట్టి సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలు పెట్టారు. 

Also Read :  తెలంగాణలో దారుణం.. క్షుద్రపూజల పేరుతో చిన్నారితో నీచంగా..!

Also Read :  పైల్స్ రోగులు ఈ ఐదు పదార్థాలకు దూరంగా ఉండండి.. లేదంటే అంతే సంగతి!

కథ వస్తే చేస్తా.. 

ఇదిలా ఉంటే రీసెంట్ గా  'సింగం'  డైరెక్టర్ హరి మీడియాతో మాట్లాడుతూ "సింగం 4" గురించి ప్రస్తావించారు.  ఇంత పెద్ద ఫ్రాంచైజీకి సీక్వెల్ తీస్తే, అది ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ఉండాలి. మంచి కథ వస్తే తప్పా ముందుకు వెళ్లే ఆలోచన లేదు అని అన్నారు. ఇంతలో సూర్య సింగం లుక్ లో కనిపించడంతో  'సింగం 4'  కి కథ సిద్ధమైందా? అని అనుకుంటున్నారు నెటిజన్లు.  సింగం ఫ్రాంచైజీలో విడుదలైన పార్ట్  1, 2, 3 సూపర్ హిట్లుగా నిలిచాయి.  అభిమానులు కూడా సింగం 4 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

సూర్యను చివరిసారిగా "రెట్రో" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే సినిమా ఆశించిన స్థాయిలో ఫ్యాన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సూర్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. 

Also Read: Narayana Murthy: పవన్ కళ్యాణ్ అలా చేయడం సరైనది కాదు.. థియేటర్ల బంద్ పై ఆర్. నారాయణమూర్తి షాకింగ్ కామెంట్స్!

 

singam 4 | actor-suriya | cinema-news | Latest News

Advertisment
Advertisment
తాజా కథనాలు