Kanguva : వామ్మో.. 'కంగువా' అన్ని వేల స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందా?

సూర్య 'కంగువా' మూవీని ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 10 వేల‌కు పైగా స్క్రీన్‌ల‌లో విడుద‌ల చేయ‌నున్నారట. ఈ విషయాన్ని నిర్మాత తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. అందులో సౌత్‌లో 2,500 కంటే ఎక్కువ స్క్రీన్‌లు, నార్త్‌లో 3,500 స్క్రీన్‌లలో లాక్ చేశామని పేర్కొన్నారు.

New Update
sdsd

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం 'కంగువ'. ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్, UV క్రియేషన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. 

నవంబర్ 14 ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాను అన్ని భాషల్లో భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే మూవీ టీమ్ సౌత్ తో పాటూ నార్త్ లోనూ వరుస ప్రమోషన్స్ చేసింది. ఈ నేపథ్యంలో సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నారట. 

Also Read : 'జై హనుమాన్' లో మరో స్టార్ హీరో.. ప్రశాంత్ వర్మ ప్లానింగ్ వేరే లెవెల్

10,000 థియేటర్స్ లో..

మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో స్టూడియో గ్రీన్ నిర్మాత మాట్లాడుతూ.. 'కంగువా' మూవీని ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 10 వేల‌కు పైగా స్క్రీన్‌ల‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు.' మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాము. తమిళనాడులో ఇప్పటికే 700 కి పైగా స్క్రీన్‌లు కన్ఫర్మ్ అయ్యాయి. సౌత్‌లో 2,500 కంటే ఎక్కువ స్క్రీన్‌లు, నార్త్‌లో దాదాపు 3,000 నుండి 3,500 స్క్రీన్‌లలో లాక్ చేశాము. 

మొత్తంగా ప్ర‌పంచ వ్యాప్తంగా న‌వంబ‌ర్ 14న 10,000 కంటే ఎక్కువ స్క్రీన్‌లలో ఈ చిత్రం విడుద‌ల కానుంది..' అని తెలిపారు. దీంతో సూర్య కెరీర్ లోనే 'కంగువా' బిగ్గెస్ట్ రిలీజ్ గా నిలవనుంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని కథానాయికగా నటించింది. బాబీ డియోల్ విలన్ రోల్ చేశారు.

Also Read : రెండో సారి కూడా ఆ పని చేసే అమ్మాయితోనే డైరెక్టర్ క్రిష్ పెళ్లి..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు