Suriya Karuppu: సూర్య కొత్త సినిమా ‘కరుప్పు’.. పోస్టర్ ఊర మాస్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కొత్త చిత్రానికి టైటిల్ ఖరారు అయింది. ఈ చిత్రానికి ‘కరుప్పు’ అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా సూర్య కెరీర్‌లో 45వ మూవీగా రూపొందబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ అదిరిపోయే పోస్టర్‌ను షేర్ చేశారు.

author-image
By Seetha Ram
New Update
suriya new movie title announced karuppu

suriya new movie title announced karuppu

KARUPPU:

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కొత్త చిత్రానికి టైటిల్ ఖరారు అయింది. ఈ చిత్రానికి ‘కరుప్పు’ అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా సూర్య కెరీర్‌లో 45వ మూవీగా రూపొందబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ అదిరిపోయే పోస్టర్‌ను షేర్ చేశారు. అందులో సూర్య కత్తి పట్టుకుని ఎర్రటి వెలుగులో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. 

Also Read: ఇండిగో విమానంలో చిక్కుకున్న మరో మాజీ CM

ఈ మూవీకి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇకపోతే ఇందులో సూర్య సరసన హీరోయిన్‌గా త్రిష నటిస్తుంది. అలాగే శివద, స్వశిక, యోగి బాబు, ఇంద్రన్స్, నట్టి సుబ్రమణ్యం, ఇతరులు కూడా ఇందులో భాగం అయ్యారు. అంతేకాకుండా ఈ చిత్రానికి సాయి అభయ్ంకర్‌ సంగీత అందించబోతున్నాడు. మొదట ఎఆర్ రెహమాన్ అని అనౌన్స్ చేసినప్పటికీ.. ఇప్పుడు ఆయన స్థానంలో సాయి అభయ్‌ంకర్‌ను తీసుకున్నారు. 

Also Read: డీఎంకే కుటుంబంలో కలహాలు..ఆస్తి కోసం సోదరుల తగువులు

కాగా సూర్య ఇటీవల రెట్రో మూవీతో వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది. దీనికంటే ముందు కంగువా మూవీతో వచ్చాడు. ఇది కూడా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలం అయింది. మరి ఇప్పుడు ‘కరుప్పు’ మూవీ సూర్యను కంబ్యాక్ చేస్తుందా? లేదా అనేది చూడాలి. 

Also Read: నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్లు, టాంపూన్లు, కప్‌లు.. ఏవి మంచివి?

Advertisment
Advertisment
తాజా కథనాలు