ఒకే వేదికపై సూర్య, ప్రభాస్, రజినీకాంత్.. ఫ్యాన్స్ కు పండగే

సూర్య 'కంగువ' మూవీని సపోర్ట్ చేసేందుకు రజినీకాంత్, ప్రభాస్ వస్తున్నారట. తమిళనాట జరగబోయే 'కంగువ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజినీకాంత్ గెస్ట్ గా సందడి చేయనున్నారు. అలాగే ఇదే కార్యక్రమానికి ప్రభాస్‌ కూడా రానున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

New Update
surya44

Prabhas And Rajinikanth: ఒకే స్టేజ్ పై ఇద్దరూ లేదా అంతకన్నా ఎక్కువ మంది హీరోలు కనిపిస్తే అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఈ మధ్య కాలంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఎక్కువగా ఇలా జరగడం చూస్తున్నాం. ఓ హీరో ప్రీ రిలీజ్ కు మరో హీరో గెస్ట్ గా రావడం మాములే. అయితే త్వరలో జరగనున్న ఓ హీరో సినిమా ఈవెంట్ కు ఇద్దరు స్టార్ హీరోలు గెస్టులుగా రాబోతున్నారట. 

ఇంతకీ వాళ్ళెవరనే వివరాల్లోకెళ్తే.. కోలీవుడ్ స్టార్ సూర్య (Surya) హీరోగా 'కంగువ' (Kanguva) అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అక్టోబరు 10నే విడుదల కావాల్సింది. కానీ అదే రోజు రజనీకాంత్‌ వెట్టయాన్‌ రిలీజ్ కూడా ఉండటంతో 'కంగువ' విడుదలను నవంబరు 14కు మార్చారు. సూపర్ స్టార్  మీద ఉన్న గౌరవంతో అక్టోబర్‌ 10న విడుదల కావాల్సిన తన సినిమాను సూర్య వాయిదా వేసుకున్నారు.

Also Read: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

ప్రీ రిలీజ్ గెస్టులుగా..

Also Read: ఐఫోన్ 13, 14, 15లపై ఆఫర్ల జాతర.. ఇప్పుడు మిస్ అవ్వొద్దు!

ఇక ఇప్పుడు తలైవా సైతం సూర్య కోసం వస్తున్నారట. 'కంగువ' ప్రీరిలీజ్‌ కార్యక్రమానికి రజనీకాంత్​ గెస్ట్ గా రానున్నారట. ఇదే కార్యక్రమానికి ప్రభాస్‌ కూడా రానున్నారని తెలుస్తోంది. 'కంగువ' నిర్మాతల్లో యువీ క్రియేషన్స్ కూడా ఒకరు. 'యూవీ' బ్యానర్ అధినేతలు​ వంశీ, ప్రమోద్‌లు ఇద్దరూ ప్రభాస్‌కు మంచి​ స్నేహితులు. 

Also Read : SDT18 : యోధుడిగా సాయి తేజ్.. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏంది సామీ

దీంతో ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి మరింత ప్రమోషన్‌ కల్పించేందుకు పెంచేలా ప్రభాస్‌ కూడా భాగం కానున్నారని సమాచారం. ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు. త్వరలోనే మేకర్స్ నుంచి దీనిపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. కాగా 'కంగువ' మూవీ రెండు భాగాలుగా రానుంది. ఇప్పటికే డబ్బింగ్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది. బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నారు.

Also Read: రూ.9 కే బీమా.. దీపావళి వేళ ఫోన్‌పే అదిరిపోయే శుభవార్త!

Advertisment
Advertisment
తాజా కథనాలు