కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం ‘కంగువ’. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ కలిసి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. కానీ అందరి అంచనాలను ఈ సినిమా తలకిందులు చేసింది.
ఇది కూడా చదవండి: తప్పు జరిగింది.. పొరపాటైంది: లగచర్ల మహాధర్నాలో కేటీఆర్
ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే మిక్స్‌డ్ టాక్ అందుకుంది. ఈ సినిమా మొత్తం సూర్య వన్ మెన్ షోగా నడిచిందని.. ఏ ఒక్కరి క్యారెక్టర్‌తోనూ ఎమోషన్‌ను కనెక్ట్ కాలేదని కొందరు చెప్పుకొచ్చారు. అదే సినిమాకు అతి పెద్ద మైనస్‌గా తెలిపారు.
రూ.350 కోట్ల బడ్జెట్
ఇక ఫస్ట్ డే నుంచే సినిమాపై రకరకాల కామెంట్స్ వినిపించడంతో కలెక్షన్లపై భారీగా దెబ్బపడింది. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిడంతో నిర్మాతలకు గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడకపోవడంతో ఓటీటీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు.
Also Read: మీ దగ్గర బిట్ కాయిన్ ఉందా... అయితే మీరు కోటీశ్వరులైనట్లే..
తాజా సమాచారం ప్రకారం.. కంగువ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియో అధిక ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో మూవీ రిలీజ్ అయిన ఆరు-ఎనిమిది వారాల్లోపు స్ట్రీమింగ్ చేయనున్నట్లు ముందుగా టాక్ వచ్చింది.
అనుకున్న దానికంటే ముందుగానే
అయితే ఇప్పుడు మరో వార్త వినిపిస్తోంది. అనుకున్న దానికంటే మరింత ముందుగానే కంగువ ఓటీటీలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని వీలైనంత తొందరగా ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు ప్రైమ్ వీడియో సన్నాహాలు చేస్తుంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. కంగువ డిసెంబర్ 13న స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం త్వరలో వెల్లడి కానుంది.
Also Read : ల్యాండ్‌మైన్స్ ఉత్పత్తిపై నిషేధం.. ఐరాస చీఫ్ కీలక ప్రకటన!
A story that travels 500 years from 1700’s to 2023 about a Hero who has to fulfil a mission left unfinished. #Kanguva available post-theatrical release. #AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/q6StN8XD3e
— prime video IN (@PrimeVideoIN) March 19, 2024
Also Read : జెట్ స్పీడ్‌లో OTTలోకి వచ్చేస్తున్న ‘కంగువ’.. ఎప్పుడంటే?