నేటి నుంచి దక్షిణాఫ్రికాతో T20 సిరీస్.. యువ ఆటగాళ్లు రాణిస్తారా?
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు టీ20 సిరీస్ జరగనుంది. ఈ రోజు రాత్రి 8:30 గంటలకు డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు టీ20 సిరీస్ జరగనుంది. ఈ రోజు రాత్రి 8:30 గంటలకు డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఐపీఎల్ 2025 వేలంలో ఇంగ్లండ్ క్రికెటర్ జేమ్స్ అండర్సన్ పోటీపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 42 ఏళ్ల అండర్సన్ తన కనీస ధర రూ.1.25 కోట్లకు పేరును నమోదు చేసుకున్నాడు. జిమ్మీ అన్‌సోల్డ్‌గా మిగులుతాడా, రికార్డు క్రియేట్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
మహిళల ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ 2025లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఆర్సీబీకి స్మృతి మంధాన, ఏక్తా బిష్త్, ఢిల్లీకి జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, తదితరులను అంటిపెట్టుకున్నాయి.
సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ లో సంజు శాంసన్ పై అందరి దృష్టి ఉంటుందని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అన్నాడు. బంగ్లాపై సెంచరీ ఇందుకు కారణమన్నారు. సంజూ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయినా మంచి క్లాస్ ప్లేయర్ అన్నాడు. మరిన్ని అవకాశాలు కల్పించాలన్నాడు.
సౌతాఫ్రికాతో టీ 20 సిరీస్ లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు సొంతం చేసుకునే అవకాశముంది. మరో 10 వికెట్లు తీస్తే ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలవనున్నాడు. భువీ 37 వికెట్ల రికార్డు బద్దలు కానుంది.
అంతర్జాతీయ బాక్సింగ్ వేదికపై భారత ప్రొఫెషనల్ బాక్సర్ మన్దీప్ జాంగ్రా సత్తా చాటాడు. కేమన్ ఐలాండ్స్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య (WBF) సూపర్ ఫెదర్ వెయిట్లో ఛాంపియన్‌గా నిలిచాడు. తన విజయం భారత ప్రతిష్ట పెంచిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు.
ఆర్సీబీ రిటైన్ చేసుకోకపోవడంపై ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'జట్టు యాజమాన్యం రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలను ముందే చెప్పింది. ఆర్సీబీతో నా ప్రయాణం ముగియలేదు. ఆర్సీబీ తీసుకున్న నిర్ణయంతో నేను సంతోషంగా ఉన్నా' అన్నాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం పతకం గెలిచిన అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ ఇష్యూపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'ఇమానె ఆమె కాదు అతడే అని రుజువయ్యాక ఇంకెందుకు అనుమానం. స్వర్ణ పతకం వెనక్కి తీసుకోండి' అని సూచించాడు.
2036 ఒలింపిక్స్ క్రీడలకు అతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధమవుతోంది. నిర్వాహణకు సంబంధించి IOCకి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధికారికంగా లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను సమర్పించినట్లు సమాచారం. 2025లో ఐఓసీ అధ్యక్ష ఎన్నికల తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది.