ఫోకస్ అంతా అతడిమీదే.. జట్టులో పర్మినెంట్‌గా ఉంచండి: కుంబ్లే

సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ లో సంజు శాంసన్‌ పై అందరి దృష్టి ఉంటుందని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అన్నాడు. బంగ్లాపై సెంచరీ ఇందుకు కారణమన్నారు. సంజూ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయినా మంచి క్లాస్ ప్లేయర్ అన్నాడు. మరిన్ని అవకాశాలు కల్పించాలన్నాడు.

author-image
By srinivas
New Update
ae

Ind vs Sa: రేపటితో భారత్- సౌతాఫ్రికా మధ్య నాలుగు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది. నవంబర్ 8న డర్బన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆగటాళ్లంగా ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు. అయితే ఈ సిరీస్‌లో ఫోకస్ అంతా సంజు శాంసన్‌ పైనే ఉందంటూ భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దాదాపు 10ఏళ్ల నుంచి భారత జట్టుకు ఆడుతున్న శాంసన్ తన స్థానాన్ని ఇప్పటికీ పదిలం చేసుకోలేకపోతున్నాడని, నిలకడగా రాణించకపోవడంతో ఈసారి అతనిపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉందన్నాడు.

Also Read: పృథ్వీ- విష్ణు ప్రియా విడిపోయినట్లేనా..! ఇద్దరి మధ్య పెద్ద గొడవ

 

సంజూ సామర్థ్యమేంటో నాకు తెలుసు.. 

ఈ మేరకు రీసెంట్ ఇంటర్వ్యూలో కుంబ్లే మాట్లాడుతూ.. సంజూ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో కొన్నిసార్లు తుది జట్టు నుంచి తప్పించడంతోపాటు మరికొన్ని సార్లు జట్టులోకి తీసుకోలేదు. కానీ ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20లో మాత్రం సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే సఫారీలతో టీ20 సిరీస్‌కు వికెట్‌కీపర్‌గా ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్‌పై చేసిన సెంచరీ అతనికి చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. సంజూ సామర్థ్యమేంటో నాకు బాగా తెలుసు. క్లాస్ ప్లేయర్. భారత సెలక్టర్లు దానిని దృష్టిలో ఉంచుకుని అవకాశాలు కల్పించాలి. ఓపెనర్‌గా లేదా రెండు, మూడు స్థానాల్లోనూ రాణించగలడు. స్పిన్నర్లను సులభంగా ఆడగలడు' అంటూ తన అభిప్రాయం వ్యక్త పరిచాడు. 

Also Read: ఫోకస్ అంతా అతడిమీదే.. జట్టులో పర్మినెంట్‌గా ఉంచండి: కుంబ్లే

సిరీస్‌ షెడ్యూల్
తొలి టీ20 - నవంబర్‌ 8
రెండో టీ20 - నవంబర్ 10 
మూడో టీ20 - నవంబర్ 13 
నాలుగో టీ20 - నవంబర్ 15 

ఇండియా టీమ్: 
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, రింకు సింగ్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్య, రమణ్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, సంజు శాంసన్, జితేశ్‌ శర్మ, రవి బిష్ణోయ్‌, వరుణ్‌ చక్రవర్తి, విజయ్‌కుమార్ వైశాఖ్‌, అర్ష్‌దీప్ సింగ్, యశ్‌ దయాళ్, అవేశ్ ఖాన్. 

Also Read: ట్రంప్ విజయం..ఎలాన్ మామకు డబ్బులే డబ్బులు

దక్షిణాఫ్రికా టీమ్:
మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), బార్ట్‌మన్, కొయెట్జీ, డొనోవన్‌ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్క్‌ యాన్సెన్, హెన్రిచ్‌ క్లాసెన్, పాట్రిక్‌ క్రగర్, కేశవ్‌ మహరాజ్, డేవిడ్‌ మిల్లర్, మిలాలి ఎంపొంగ్వానా, ఎంకాబా పీటర్, రికల్టన్, సైమ్‌లేన్, సిపామ్లా, స్టబ్స్‌.

Also Read: Saudi Arabia: ఎడారి దేశంలో మంచు వర్షం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు