WBF: సత్తా చాటిన భారత బాక్సర్.. WBF టైటిల్ కైవసం! అంతర్జాతీయ బాక్సింగ్ వేదికపై భారత ప్రొఫెషనల్ బాక్సర్ మన్‌దీప్ జాంగ్రా సత్తా చాటాడు. కేమన్ ఐలాండ్స్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య (WBF) సూపర్ ఫెదర్ వెయిట్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. తన విజయం భారత ప్రతిష్ట పెంచిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. By srinivas 06 Nov 2024 | నవీకరించబడింది పై 06 Nov 2024 20:28 IST in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి Mandeep Jangra: అంతర్జాతీయ బాక్సింగ్ వేదికపై భారత ప్రొఫెషనల్ బాక్సర్ మన్‌దీప్ జాంగ్రా సత్తా చాటాడు. ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య (డబ్ల్యూబీఎఫ్) సూపర్ ఫెదర్ వెయిట్‌లో అదిరే ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచాడు. కేమన్ ఐలాండ్స్‌లో జరిగిన ఈ ఈవెంట్ టైటిల్ పోరులో బ్రిటన్ బాక్సర్ కానర్ మెకంతోష్ ను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. మొత్తం 10 రౌండ్ల పోరులో ఆరంభం నుంచి భారీ పంచ్‌లతో విరుచుకుపడిన వన్ దీప్.. ప్రత్యర్థిని కోలుకోకుండా దెబ్బతీశాడు. 31 ఏళ్ల ఈ హరియాణా స్టార్ పంచ్ పవర్ ముందు బ్రిటన్ ప్రత్యర్థి నిలువలేకపోయాడు. అమెచ్యూర్ సర్క్యూట్‌లో 12 సార్లు రింగ్‌లోకి దిగితే కేవలం ఒకే ఒక్కసారి ఓడిన మన్‌దీప్ 11 సార్లు ఘనవిజయం సాధించాడు. View this post on Instagram A post shared by The Bridge | Indian Sports (@thebridge_in) ఇదే అతిపెద్ద విజయం.. ఈ సందర్భంగా మాట్లాడిన మన్ దీప్.. ‘నా కెరీర్లోనే ఇదే అతిపెద్ద విజయం. ఎన్నో ఏళ్లపాటు కఠోరంగా శ్రమించినందుకు దక్కిన ఫలితమిది. భారత ప్రతిష్ట పెంచిన విజయమిది. నన్ను ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలు’ తెలపాడు. ఇక మాజీ ఒలింపిక్ రజత పతక విజేత రాయ్ జోన్స్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న మన్‌దీప్.. 2021లో ప్రొఫెషనల్ కెరీర్ ఆరంభించాడు. అతడు ఇప్పటిదాకా 12 బౌట్లు ఆడి కేవలం ఒక్క ఓటమే చవిచూశాడు. అమెచ్యూర్ బాక్సింగ్‌లో మన్‌దీప్ 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో రజతం గెలిచాడు. #title #boxing మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి