Imane Khelif: ఆమె కాదు అతడే.. స్వర్ణ పతకం వెనక్కి తీసుకోండి: హర్భజన్‌

పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం పతకం గెలిచిన అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్‌ ఇష్యూపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'ఇమానె ఆమె కాదు అతడే అని రుజువయ్యాక ఇంకెందుకు అనుమానం. స్వర్ణ పతకం వెనక్కి తీసుకోండి' అని సూచించాడు.

author-image
By srinivas
New Update
d edr dr

Imane Khelif: పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం పతకం గెలిచి చరిత్ర సృష్టించిన అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్‌ ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది. ఇమానె ఆమె కాదు అతడే అంటూ ఎన్నో ఆరోపణలు వచ్చినా ఒలిపింక్స్ నిర్వాహకులు పట్టించుకోలేదు. దీంతో ఇమానె ఫైనల్‌కు చేరి విజేతగా నిలిచింది. అయితే ఇమానె జెండర్‌పై ఇంకా అనుమానాలు వ్యక్తమవుతుండగా.. భారత మాజీ క్రికెటర్ హర్భజన్‌ సింగ్ ఈ వివాదంపై తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. 

అతడు పురుషుడే..

ఈ మేరక సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అయిన భజ్జీ.. ఇమానె నుంచి స్వర్ణ పతకం వెనక్కి తీసుకోవాలని సూచించాడు. మెడికల్ రిపోర్ట్‌ ప్రకారం అతడు పురుషుడేనని తేలిన తర్వాత ఇంకెందుకు అనుమానం అంటూ ప్రశ్నించాడు. ఖెలిఫ్‌ లింగ గుర్తింపుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్ లీక్‌ కావడం, అందులో కీలక విషయాలు వెల్లడి కావడం క్రీడా వర్గాలను షాక్‌కు గురిచేసిన అంశాన్ని హర్భజన్ గుర్తు చేశాడు.

ఇది కూడా చదవండి:  US Election 2024: అమెరికా ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలివే!

అతడిలో XY క్రోమోజోమ్స్‌..

ఇక మెడికల్ రిపోర్టుల ప్రకారం అతడిలో XY క్రోమోజోమ్స్‌లు ఉన్నాయి. పురుషుడిలోని టెస్టోస్టిరాన్లు ఖెలిఫ్‌లోనూ ఉన్నాయి. అయినా ఒలింపిక్‌ కమిటీ పట్టించుకోకపోవడం బాధకరమంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక చైనాకు చెందిన యంగ్‌ లూయిపై 5-0తో ఖెలిఫ్‌ గెలిచి స్వర్ణం సొంతం చేసుకుంది ఇమానె. అయితే తొలి పోరు నుంచే అనుమానాలు వ్యక్తమవుతున్నా వైదొలగకుండా ఖెలిఫ్‌ కొనసాగడం విశేషం. కాగా 2023, న్యూ ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్ ఫైట్‌లో పాల్గొనకుండా అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ (IBA) ఖలీఫ్‌ను నిషేధించింది.

ఇది కూడా చదవండి:  తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ .. పరీక్ష ఫీజు పై కీలక ప్రకటన

Advertisment
తాజా కథనాలు