అరుదైన రికార్డుకు చేరువలో అర్ష్‌దీప్.. భువీ రికార్డు బద్దలు కొడతాడా!

సౌతాఫ్రికాతో టీ 20 సిరీస్ లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు సొంతం చేసుకునే అవకాశముంది. మరో 10 వికెట్లు తీస్తే ఒక క్యాలెండర్ ఇయర్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలవనున్నాడు. భువీ 37 వికెట్ల రికార్డు బద్దలు కానుంది. 

New Update
se

Arshdeep Singh: సౌతాఫ్రికా- భారత్ మధ్య నాలుగు టీ20ల సిరీస్‌ డర్బన్ వేదికగా నవంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. టీమ్ఇండియాకు సూర్యకుమార్‌ యాదవ్, సౌతాఫ్రికాకు మార్‌క్రమ్‌లు కెప్టెన్లుగా వ్యవహరించనుండగా.. ఈ సిరీస్‌లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు సొంతం చేసుకునే అవకాశముంది. ఈ మేరకు టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం భువనేశ్వర్‌ కుమార్‌ పేరిట ఉండగా..  సఫారీలతో సిరీస్‌లో అర్ష్‌దీప్ 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధిస్తే భారత్‌ తరఫున టీ20ల్లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కుతాడు.

అగ్రస్థానంలో యుజ్వేంద్ర చాహల్..

2022లో 32 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ కుమార్ 6.98 ఎకానమీతో 37 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ ఈ ఏడాది 14 మ్యాచ్‌లు ఆడి 7.14 ఎకానమీతో 28 వికెట్లు పడగొట్టాడు. గత టీ20 ప్రపంచకప్‌లో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈ జాబితాలో యుజ్వేంద్ర చాహల్ (96) అగ్రస్థానంలో ఉన్నాడు.

సిరీస్‌ షెడ్యూల్
తొలి టీ20 - నవంబర్‌ 8
రెండో టీ20 - నవంబర్ 10 
మూడో టీ20 - నవంబర్ 13 
నాలుగో టీ20 - నవంబర్ 15 

ఇండియా టీమ్: 
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, రింకు సింగ్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్య, రమణ్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, సంజు శాంసన్, జితేశ్‌ శర్మ, రవి బిష్ణోయ్‌, వరుణ్‌ చక్రవర్తి, విజయ్‌కుమార్ వైశాఖ్‌, అర్ష్‌దీప్ సింగ్, యశ్‌ దయాళ్, అవేశ్ ఖాన్. 

దక్షిణాఫ్రికా టీమ్:
మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), బార్ట్‌మన్, కొయెట్జీ, డొనోవన్‌ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్క్‌ యాన్సెన్, హెన్రిచ్‌ క్లాసెన్, పాట్రిక్‌ క్రగర్, కేశవ్‌ మహరాజ్, డేవిడ్‌ మిల్లర్, మిలాలి ఎంపొంగ్వానా, ఎంకాబా పీటర్, రికల్టన్, సైమ్‌లేన్, సిపామ్లా, స్టబ్స్‌.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు