IPL: ఐపీఎల్ వేలంలోకి 42 ఏళ్ల ఇంగ్లండ్ పేసర్.. రూ.1.25 కోట్ల డిమాండ్!

ఐపీఎల్ 2025 వేలంలో ఇంగ్లండ్‌ క్రికెటర్ జేమ్స్ అండర్సన్ పోటీపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 42 ఏళ్ల అండర్సన్ తన కనీస ధర రూ.1.25 కోట్లకు పేరును నమోదు చేసుకున్నాడు. జిమ్మీ అన్‌సోల్డ్‌గా మిగులుతాడా, రికార్డు క్రియేట్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. 

author-image
By srinivas
New Update
serere

IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇంగ్లండ్‌ వెటరన్ క్రికెటర్ జేమ్స్ అండర్సన్ పోటీపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నవంబర్ 24, 25 తేదీల్లో రియాద్ వేదికగా వేలం నిర్వహించనుండగా.. 42 ఏళ్ల అండర్సన్ తన కనీస ధర రూ.1.25 కోట్లకు పేరును నమోదు చేసుకున్నాడు. ఈ ఏడాది టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జేమ్స్.. చివరగా 2014లో టీ20 మ్యాచ్‌ ఆడాడు. అప్పటినుంచి ఏ లీగ్‌లోనూ పాల్గొనపోగా.. ఈసారి ఐపీఎల్ పై ఆసక్తి కనబరచడంపై మాజీలు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

రిటైర్‌మెంట్‌ ప్లానింగ్‌లో భాగంగానే..

'అండర్సన్ వేలంలో పేరు నమోదు చేసుకోవడం నిజంగా షాక్ అయ్యాను. చివరిసారి 2009లో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడిన జిమ్మీ.. దేశవాళీ టీ20 ఆడి పదేళ్లు దాటింది. నాకు తెలిసి రిటైర్‌మెంట్‌ ప్లానింగ్‌లో ఉన్నట్లున్నాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడేమో అనిపిస్తోంది. ఇలాంటప్పుడు రూ.1.25 కోట్లతో పేరును నమోదు చేసుకోవడం గమనార్హం. నాకు తెలిసి అతడిని ఎవరూ తీసుకొనే అవకాశం లేదు. అన్‌సోల్డ్‌గా మిగులుతాడనిపిస్తోంది' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మెగా వేలంలోకి రావడం లేదని ప్రకటించడం క్రికెట్ లవర్స్ ను ఆశ్చర్యపరిచింది. 2024 ఐపీఎల్ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశమూ రాకపోవడంతో 2025 ఎడిషన్‌కు అందుబాటులో ఉండటం కష్టమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు