KL Rahul: ఎట్టకేలకు తండ్రి కాబోతున్న భారత క్రికెటర్.. పోస్ట్ వైరల్!

భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, నటి అథియా శెట్టి దంపతులు ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పారు. 2025లో తాము పేరెంట్స్ కాబోతున్నామంటూ అథియా శెట్టి సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. చిన్ని పాదాలతో కూడిన ఫొటోను షేర్ చేయగా ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు.

author-image
By srinivas
New Update
se

KL Rahul: భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, నటి అథియా శెట్టి దంపతులు ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పారు. 2025లో తాము పేరెంట్స్ కాబోతున్నామంటూ అథియా శెట్టి సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. 'Our beautiful blessing is coming soon 2025' అంటూ చిన్ని పాదాలతో కూడిని ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌ అవుతున్నారు. ఇరువురికి కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి కూతురు అథియాశెట్టి క్రికెటర్ కేఎల్ రాహుల్ ను 2023లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 

Also Read:  నేటి నుంచి దక్షిణాఫ్రికాతో T20 సిరీస్.. యువ ఆటగాళ్లు రాణిస్తారా?

మళ్లీ నిరాశ పరిచిన రాహుల్..

ఇదిలా ఉంటే.. రాహుల్ ప్రస్తుతం బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. భారత్‌-ఎ, ఆస్ట్రేలియా-ఎ మధ్య జరుగుతున్న రెండో అనధికార టెస్టులో ఆడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో మళ్లీ నిరాశపరిచాడు. కివీస్‌తో తొలి టెస్టులో విఫలమవడంతో ఆ తర్వాతి రెండు టెస్టులకు వేటు ఎదుర్కొన్న రాహుల్.. ఆసీస్‌-ఎతో మ్యాచ్‌లోనూ తేలిపోయాడు. గురువారం ఆస్ట్రేలియా-ఎతో (AUS a Vs IND a) ఆరంభమైన రెండో అనధికార టెస్టులో భారత్‌-ఎ తరపున బరిలో దిగిన రాహుల్‌ ఓపెనర్‌గా దిగి 4 పరుగులకే ఔటయ్యాడు. 

Also Read: ఐపీఎల్ వేలంలోకి 42 ఏళ్ల ఇంగ్లండ్ పేసర్.. రూ.1.25 కోట్ల డిమాండ్!

Also Read: చంద్రబాబు సర్కార్‌కు హైకోర్టు షాక్!

Also Read:TGPSC: సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. తెలంగాణ గ్రూప్-1 రద్దు?

Advertisment
తాజా కథనాలు