New Mobile: ఐఫోన్ డిజైన్‌తో కొత్త ఫోన్.. కేవలం రూ.10 వేల లోపే!

లావా త్వరలో భారతదేశంలో లావా షార్క్ 5Gని విడుదల చేయబోతోంది. మే 23న లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. దీని ధర కేవలం రూ.10,000 కంటే తక్కువగానే ఉండబోతుంది. IP54 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. ఐఫోన్ డిజైన్‌ గల కెమెరాలతో వస్తుంది.

New Update
lava shark 5g

lava shark 5g

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా త్వరలో భారతదేశంలో లావా షార్క్ 5Gని విడుదల చేయబోతోంది. ఈ ఫోన్ లాంచ్ తేదీ, దాని ఫీచర్లను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ ఫోన్ ధరను కూడా కంపెనీ ప్రకటించింది. రాబోయే స్మార్ట్‌ఫోన్ మార్చిలో రిలీజ్ అయిన లావా షార్క్ 4G మాదిరి డిజైన్‌ను కలిగి ఉంటుందని అంతా భావిస్తున్నారు. లావా షార్క్ 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర గురించి పూర్తిగా తెలుసుకుందాం. లావా షార్క్ 5G భారతదేశంలో మే 23న లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. భారతదేశంలో దీని ధర రూ. 10,000 లోపు ఉంటుంది. 

Also Read :  ఆల్కహాల్ బ్రాండ్ కి బాలయ్య యాడ్.. పద్మ భూషణ్ తిరిగి ఇవ్వాలంటూ నెటిజన్ల ట్రోలింగ్! వీడియో వైరల్

లావా షార్క్ 5G స్పెసిఫికేషన్లు

లావా షార్క్ 5G ఫోన్ 13MP ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో AI ఇంటిగ్రేటెడ్‌తో వస్తుంది. ఇది IP54 రేటింగ్‌తో రానుంది. ఈ పరికరం Unisoc T765 SoC ద్వారా 4GB RAMతో వస్తుంది. అదే సమయంలో 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ బాక్స్‌లో రన్ అవుతుంది. లావా షార్క్ 4G భారతదేశంలో 4GB RAM - 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ.6,999కి లాంచ్ అయింది. 

Also Read : ఐస్ క్రీంలో బల్లి తోక.. కట్ చేస్తే రూ.50,000 ఫైన్ - వీడియో చూశారంటే?

ఇక త్వరలో రాబోతున్న 5G వేరియంట్ ధర గరిష్టంగా రూ.1,000 లేదా రూ.2,000 ఎక్కువగా ఉంటుందని అంచనా. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం ఈ ఫోన్ IP54 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. షార్క్ 5G డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఇది బ్లూ, గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది. ఒక రకంగా ఈ ఫోన్ కెమెరా షేపు.. ఐఫోన్ మాదిరి ఉంటుంది. ఇందులో యూనిసాక్ T765 ప్రాసెసర్ ఉంటుంది. రాబోయే ఫోన్ ఆండ్రాయిడ్ 15 లో రన్ అవుతుందని భావిస్తున్నారు. 

Also Read : నవంబర్‌లో కుప్పకూలనున్న మోదీ సర్కార్.. ?

లావా షార్క్ 4G స్పెసిఫికేషన్లు

లావా షార్క్ 4G 4GB + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. కెమెరా సెటప్ కోసం వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అందించారు. ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది యూనిసాక్ T606 ప్రాసెసర్‌తో అమర్చబడి ఉంది. 18W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ దుమ్ము, స్ప్లాష్ రక్షణ కోసం IP54 రేటింగ్‌తో వస్తుంది. 

Also Read : హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

lava | new-mobiles | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు