/rtv/media/media_files/2025/10/20/india-2025-10-20-06-34-16.jpg)
దీపావళి(Diwali 2025) ఒక్కరోజు ముందు టీమిండియా(team-india) పురుషులు, మహిళల క్రికెట్ జట్లు ఓడిపోవడం భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ముందుగా పెర్త్ వేదికగాజరిగిన తొలి వన్డేలో భారత జట్టుపై 7 వికెట్ల తేడాతో ఆసీస్ జట్టు విజయం సాధించింది. ఆ తరువాత ఐసిసి మహిళల వన్డే ప్రపంచ కప్((ICC Women's World Cup))లో భాగంగా ఇండోర్ వేదికగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్(england) 4 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ రెండు ఓటములు పండక్కి ముందు రోజు జరగడం పట్ల అభిమానులు నిరాశకు గురయ్యారు.
ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 284 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ అర్ధ సెంచరీలు సాధించి భారత్‌కు విజయాన్ని అందించే పోరాటం చేశారు. అయితే, భారత్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో, సెమీఫైనల్‌కు భారత్ మార్గం మరింత కఠినంగా మారింది.
Also Read : కోహ్లీ చెత్త రికార్డును సమం చేసిన శుభ్‌మన్ గిల్
టీమ్ఇండియా పరాజయం
ఇక ఆస్ట్రేలియా(australia) తో మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా పలుమార్లు ఆటకు అంతరాయం కలగడంతో 26 ఓవర్లకు మ్యాచ్ ను కుదించారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్.. 26 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (38), అక్షర్ (31), నితీశ్ (19), శ్రేయస్ (11), సుందర్ (10), గిల్ (10) పరుగులు చేశారు. రోహిత్ (8), హర్షిత్ రాణా (1) సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా కోహ్లీ డకౌట్ అయ్యాడు. చివరి బంతితోపాటు 26వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదాడు నితీశ్ (19*). దీంతో భారత్ 130 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 2, ఓవెన్ 2, కునెమన్ 2.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ తీశారు. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆసీస్‌కు 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 21.1 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (46*), జోష్ ఫిలిప్ (37) రాణించారు. రెన్ షా (21*) , ట్రావిస్ హెడ్ (8)పరుగులు చేశారు. రెండో వన్డే గురువారం జరగనుంది. కాగా ఈ ఏడాది వన్డేల్లో భారత్‌కిది తొలి ఓటమి. వరుసగా ఎనిమిది విజయాల తర్వాత టీమ్ఇండియా పరాజయం చవిచూసింది.
Also Read : AUS vs IND : తొలి వన్డేలో భారత్ చిత్తు.. 7 వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్