Shubman Gill: శుభమన్ గిల్ అకౌంట్‌లో మరో చెత్త రికార్డు!

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్ శుభమన్ గిల్ తొలి మ్యాచ్ ఓటమి పాలై చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఓడి వెంగ్‌సర్కార్‌, విరాట్ కోహ్లీ సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది.

New Update
Gill

Gill

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కెప్టెన్‌గా శుభమన్ గిల్‌ను బీసీసీఐ నియమించింది. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కి టీమిండియా జట్టు శుభమన్ గిల్ నాయకత్వంలో ఆడి తొలి మ్యాచ్ ఓడిపోయింది. కేవలం 5 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఓటమితో గిల్ తన ఖాతాలో ఓ చెత్త రికార్డును వేసుకున్నాడు.

ఇది కూడా చూడండి: Black Magic: ఏపీలో వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోకు క్షుద్ర పూజలు - ఇలా తయారయ్యారేంట్రా

ఇది కూడా చూడండి: ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిన ట్రంప్.. నష్టం ఎవరికంటే..?

తొలి మ్యాచ్ ఓటమితో..

గిల్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసినా, భారత జట్టు మాత్రం ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో శుభ్‌మన్‌ గిల్‌ ఈ విషయంలో దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, విరాట్‌ కోహ్లీ సరసన నిలిచాడు. 1987లో వెస్టిండీస్‌తో టీమ్‌ఇండియా ఆడిన మ్యాచ్‌కు వెంగ్‌సర్కార్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ (102) చేశాడు. కానీ టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

ఇది కూడా చూడండి: Turnip: టర్నిప్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతం.. ఇటా తిన్నారంటే..!!

అలాగే విరాట్‌ కోహ్లీ 2014 డిసెంబర్‌లో అడిలైడ్‌ ఓవెల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియాకు మొదటిసారిగా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడు. ఆ మ్యాచ్‌లో అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు బాదాడు. కానీ టీమ్ఇండియా ఆసీస్‌ చేతిలో 48 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇప్పుడు టీమ్ఇండియా టెస్ట్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇది కూడా చూడండి: Mani Ratnam: 'తుగ్ లైఫ్' పరాజయంపై మొదటి సారి స్పందించిన మణిరత్నం!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు