/rtv/media/media_files/2025/05/19/q1B5cHVB8nUZ6XEpuVs1.jpg)
Asia cup
సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025(Asia cup 2025) లో ఈసారి టీమిండియా బ్లాంక్ జెర్సీలతోనే బరిలోకి దిగనుంది. దీనికి కారణం పార్లమెంట్‌లో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందడంతో టీమిండియాకు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్ 11 ఒప్పందం రద్దు చేసుకోవడమే. దీంతో ఇప్పుడు టీమిండియాకు కొత్త స్పాన్సర్ లేదు. అయితే బీసీసీఐ టీమిండియా కొత్త స్పాన్సర్ కోసం ఎదురు చూస్తోంది. టోర్నమెంట్‌లో నాన్ స్పాన్సర్ లేకుండా భారత జట్టు ఆడడం ఇదే మొదటిసారి. నిజానికి డ్రీమ్ 11 బీసీసీఐతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 2026 వరకు కొనసాగాల్సింది. కానీ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడంతో ఒప్పందంలో మధ్యలోనే రద్దు చేసుకుంది.
ఇది కూడా చూడండి: Cricketer Retirement: బిగ్ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
🔥 Shockwaves in Indian cricket! For the first time in decades, Team India is set to enter the Asia Cup 2025 without a jersey sponsor after fantasy sports giant Dream11 pulled out 😱.
— Yola Cricket (@Yolacricket) August 29, 2025
The move comes right after the new Promotion & Regulation of Online Gaming Bill 2025, which… pic.twitter.com/M1yfaPXIzp
టీమిండియా(team-india) కు స్పాన్సర్ లేకపోవడంతో జట్టులో కొన్ని మార్పులు కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్(Shubman Gill) వంటి ఆటగాళ్ల జెర్సీలపై ఇండియా లోగో పెద్దదిగా వేయనున్నట్లు సమాచారం. కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ చూస్తోంది. ఆసక్తి ఉన్న కంపెనీలు ఈ నెల 16 లోగా బిడ్డింగ్ కూడా దాఖలు చేయవచ్చు. గతంలో 2023లో డ్రీమ్11 సుమారు రూ. 358 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పుడు రూ.452 కోట్ల భారీ ఆదాయం వచ్చేలా బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం చూస్తోంది. దీని కోసం కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా రూపొందించింది. ప్రతి మ్యాచ్‌కు రూ. 3.5 కోట్లు ఉండేలా నిర్ణయించింది. ఐసీసీ, ఏసీసీ వంటి టోర్నమెంట్‌లో మ్యాచ్‌లకు రూ.1.5 కోట్ల స్పాన్సర్‌షిప్ ఫీజు ఉంటుంది. అయితే డ్రీమ్ 11 కంటే కాస్త ఎక్కువగానే ఈ కొత్త రేట్లను బీసీసీఐ పెంచింది. అయితే స్పాన్సర్‌షిప్ ఒప్పందం కేవలం దేశీయ, విదేశీ మ్యాచ్‌లకు మాత్రమే కాదు. ఏసీసీ, ఐసీసీ నిర్వహించే అన్ని అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు కూడా వర్తిస్తుంది.
ఆసియా కప్ జట్టు
సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్)తో పాటు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్ దీప్ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్ వంటి కీలక ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, ఒమన్ మొత్తం ఎనిమిది జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కానుంది.
ఇది కూడా చూడండి: Rohit Sharma: నన్నెవరేం పీకలేరు.. బ్రొంకో టెస్ట్ లో రోహిత్ పాస్