Cricketer Retirement: బిగ్ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

పాకిస్థాన్ క్రికెటర్ ఆసిఫ్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 33 ఏళ్ల ఆసిఫ్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ఇకపై దేశీయ, ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్‌లలో కొనసాగుతానని పేర్కొన్నారు. ఆయన 21 వన్డేలు, 58 టీ20లు ఆడారు.

New Update
pakistan Cricketer asif ali retires from international cricket at 33

pakistan Cricketer asif ali retires from international cricket at 33

పాకిస్తాన్‌ క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. 2025 ఆసియా కప్ ప్రారంభానికి ముందు పెద్ద ఎదురుదెబ్బను చవిచూసింది. పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఆసిఫ్ అలీ తన 33 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. ఆయన తాజాగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. 

Also Read : టీ20లకు మిచెల్ స్టార్క్ గుడ్ బై

asif ali retires from international cricket

అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఆయన దేశవాళీ, ఫ్రాంచైజీ క్రికెట్‌లను ఆడనున్నారు. ఆసిఫ్ 2018లో పాకిస్తాన్ తరపున అరంగేట్రం చేశారు. ఇప్పటివరకు 21 వన్డేలు, 58 టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. ఆసిఫ్ అలీ ఎక్కువగా పవర్ హిట్టింగ్, ఫినిషర్‌గా బాగా పేరు గాంచారు. 

కాగా ఆసిఫ్ అలీ ముఖ్యంగా 2021 T20 ప్రపంచ కప్‌లో మరింత పేరు సంపాదించుకున్నారు. అతను ఆఫ్ఘనిస్తాన్‌పై మ్యాచ్‌లో 12 బంతుల్లో 24 పరుగులు అవసరం కాగా కేవలం 7 బంతుల్లో 4 సిక్సర్లతో 25 పరుగులు చేసి పాకిస్తాన్‌ను విజయపథంలో నడిపించారు. అది మాత్రమే కాకుండా 2022 ఆసియా కప్‌లో కూడా ఆసిఫ్ భారతదేశంతో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయపథంలో నడిపించారు. అయితే ఆసిఫ్ అలీ తన కెరీర్‌లో నిలకడ లేకపోవడం వల్ల చాలా కాలం పాటు జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. 2023 ఆసియన్ గేమ్స్‌లో ఆసిఫ్ చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. 

ఇదిలా ఉంటే ఆసిఫ్ అలీ తన రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. అందులో ఆయన ‘‘పాకిస్తాన్ జెర్సీ ధరించడం నా జీవితంలో అతిపెద్ద గౌరవం. దేశం తరపున ఆడటం గర్వకారణం. ఇప్పుడు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. కానీ దేశీయ, లీగ్ క్రికెట్ ఆడటం కొనసాగిస్తాను’’ అని ఆసిఫ్ తన పోస్టులో రాసుకొచ్చారు. 

Advertisment
తాజా కథనాలు