Gautam Gambhir: నేను చెప్పినట్లే ఆడాలి.. టీమిండియా కోచ్ కీలక ఆదేశాలు

టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ క్రికెటర్లకు కీలక ఆదేశాలు చేశారట. ఇన్ని రోజులు నచ్చినట్లు ఆడారు.. కానీ ఇకపై తాను చెప్పినట్లే ఆడాలని స్పష్టం చేశారు. ఎవరు ఏ ప్లేస్‌లో బరిలోకి దిగాలనేది తానే నిర్ణయిస్తానని దాని బట్టే ఆడాలని చెప్పినట్లు తెలుస్తోంది.

New Update
Gautam Gambhir

Gautam Gambhir Photograph: (Gautam Gambhir)

టీమిండియా కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితులైనప్పటి నుంచి వరుస పరాజయాలనే చూశారు. సొంత గడ్డపై న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి, ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ మ్యాచ్‌లో గెలవాల్సిన  టీమిండియా ఓడిపోవడంతో కోచ్ గంభీర్‌పై కూడా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో గంభీర్ డ్రెస్సింగ్ రూమ్‌లో క్రికెటర్లపైన సీరిస్ అయ్యినట్లు తెలిసిందే. పేర్లు ప్రస్తావించకుండా ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఇకపై జరిగే మ్యాచ్‌లలో జాగ్రత్త వహించాలని, నచ్చినట్లు ఆడకూడదని, తాను చెప్పినట్లే ఆడాలని గంభీర్ టీమిండియాకి కీలక ఆదేశాలు చేశారట. 

ఇది కూడా చూడండి: AP JOBS: ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. అర్హత, చివరి తేదీ వివరాలివే!

ఆడని వాళ్లను బహిష్కరించే..

ఎవరికి నచ్చినట్లు ఆడుతున్నారని, ఇన్ని రోజులు ఆడినట్లు కాకుండా ఇకపై తాను నిర్ణయించినట్లు ఆడాలని తెలిపారట. ఎవరైతే ఆడరో వారిని జట్టు నుంచి తప్పస్తామని కూడా హెచ్చరించినట్లు సమాచారం. గత కోచ్‌లతో పోలిస్తే గంభీర్‌కి, క్రికెటర్ల మధ్యకి ఏకాభిప్రాయం లేదని కొందరు అంటున్నారు. ఇంతకు ముందు ఒక్కో ఆటగాడితో కోచ్ డిస్కస్ చేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలుస్తోంది. కోచ్‌ అయినప్పటి నుంచి ఇండియా ఓటమిలనే చూస్తోంది. దీంతో గంభీర్‌పై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

ఇది కూడా చూడండి:Air India: ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన ఎయిర్‌ ఇండియా..

ఇదిలా ఉండగా ఈ డ్రెస్సింగ్ రూమ్ చర్చ గురించి తాజాగా గౌతమ్ గంభీర్ స్పందించారు. ఒక ఆటగాడు, కోచ్ మధ్య చర్చలు అక్కడే ఉండాలి. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి సంభాషణలు జరిగినా కూడా బయటకు రాకూడదని తెలిపారు. 

ఇది కూడా చూడండి:TS: గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు.. విద్యార్థినుల ఆందోళన

ఇది కూడా చూడండి: RJ:బోర్‌‌వెల్‌లో పది రోజులు ఉన్న పాప..రెస్క్యూ చేసిన తర్వాత మృతి

Advertisment
తాజా కథనాలు