T20 World Cup: ప్రపంచ కప్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియం.. టీమిండియాకు అదృష్టమా? దురదృష్టమా?

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మార్చి 8వ తేదీన జరగనుంది. అయితే ఈ స్టేడియంలో టీమిండియా గెలిచిన మ్యాచ్‌లు ఉన్నాయి.. అలాగే ఓడిన మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఈ స్టేడియం స్పెషాలిటీ ఏంటో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం. 

New Update
Narendra Modi stadium

Narendra Modi stadium

టీ20 ప్రపంచ కప్(t20-world-cup) ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌(ahmedabad) లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మార్చి 8వ తేదీన జరగనుంది. అయితే ఈ స్టేడియంలో టీమిండియా గెలిచిన మ్యాచ్‌లు ఉన్నాయి.. అలాగే ఓడిన మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. అసలు ఈ స్టేడియం టీమిండియాకు అదృష్టమా? లేక దురదృష్టమా? దీని స్పెషాలిటీ ఏంటో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి:  Ind Vs Eng: హై ఓల్టేజ్ మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

దీని స్పెషాలిటీ ఏంటంటే?

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium) సుమారు 63 ఎకరాల్లో విస్తరించి ఉంది. గతంలో మోతేరా స్టేడియంగా పిలిచే ఈ మైదానాన్ని పూర్తిగా పునర్నిర్మించారు. ఒకేసారి 1,32,000 మంది ప్రేక్షకులు కూర్చోని వీక్షించేలా ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా తీర్చిదిద్దారు. ఇక్కడ సాధారణ ఫ్లడ్ లైట్లకు బదులుగా స్టేడియం పైకప్పు చుట్టూ అమర్చిన LED రింగ్ లైట్లు రాత్రిపూట పగలను తలపించే వెలుతురును ఇస్తాయి. దీనివల్ల బంతి నీడలు పడకుండా ఫీల్డర్లకు సౌకర్యంగా ఉంటుంది. అలాగే ఈ స్టేడియంలో మొత్తం 11 పిచ్‌లు ఉన్నాయి. వీటిని ఎరుపు, నలుపు మట్టితో తయారు చేశారు.

ఇది కూడా చూడండి: Pakistan Player Misbehave: నీ కామం తగలెయ్య.. మహిళా హౌస్ కీపింగ్‌తో పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన!

360 డిగ్రీల వ్యూ కనిపించేలా..

ఈ స్టేడియంలో వర్షం పడితే కేవలం అరగంటలోనే మైదానాన్ని మళ్లీ ఆటకు సిద్ధం చేసే అత్యాధునిక 'సబ్-సర్ఫేస్' డ్రైనేజీ వ్యవస్థ ఉంది. అలాగే ఇందులో నాలుగు డ్రెస్సింగ్ రూమ్‌లు, అత్యాధునిక జిమ్, ఇండోర్ ప్రాక్టీస్ కోర్టులు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ని వెనక్కి నెట్టి ఇది ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. అలాగే ఈ స్టేడియంలో 360 డిగ్రీల వ్యూ కనిపిస్తుంది. స్టేడియం లోపల ఎక్కడ కూర్చున్నా మధ్యలో పిల్లర్లు లేదా స్తంభాలు అడ్డు రాకుండా గ్రౌండ్ మొత్తం స్పష్టంగా కనిపించేలా దీన్ని డిజైన్ చేశారు. వీటితో పాటు క్లబ్ హౌస్, 76 కార్పొరేట్ బాక్స్‌లు, ఒకేసారి 3,000 కార్లు పట్టేంత పార్కింగ్, ఒలింపిక్ సైజులో ఉండే స్విమ్మింగ్, ఇండోర్ క్రికెట్ అకాడమీ, బ్యాడ్మింటన్, టెన్నిస్ కోర్టు వంటి ప్రపంచ స్థాయి వసతులు ఉన్నాయి. - ind-vs-nz

ఇది కూడా చూడండి: Ind Vs Eng: చుక్కలు చూపించిన భారత్.. ఇంగ్లాండ్‌ ముందు భారీ టార్గెట్

ఈ మైదానంలో టీమిండియా విజయాలు

భారత జట్టు అహ్మదాబాద్ గడ్డపై ఎన్నో చారిత్రక విజయాలు నమోదు చేసింది. 2011 వన్డే ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి భారత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. అలాగే 2023 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసింది. అలాగే టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించడంతో పాటు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారీ తేడాతో టీమిండియా గెలిచింది. అయితే ఇదే స్టేడియంలో టీమిండియా గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓటమిపాలైంది. వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు చేరిన భారత్.. ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే మార్చి 8న జరగనున్న టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ స్టేడియం టీమిండియాకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుందా? లేకపోతే దురదృష్టాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి. 

Advertisment
తాజా కథనాలు