Smriti Mandhana Engagement: ప్రియుడితో స్మృతి మంధాన ఎంగేజ్‌మెంట్ కంప్లీట్ - వీడియో చూశారా

టీం ఇండియా మహిళా స్టార్ బ్యాట్స్‌మన్ స్మృతి మంధాన తన నిశ్చితార్థాన్ని అధికారికంగా వెల్లడించింది. దీనికోసం ఆమె ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుంది. తనతో పాటు తన టీం ఇండియా ఆటగాళ్లతో ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ చేసి తన ఎంగేజ్‌మెంట్‌ను అందిరితో పంచుకుంది.

New Update
Smriti Mandhana Engagement

Smriti Mandhana Engagement

టీం ఇండియా మహిళా స్టార్ బ్యాట్స్‌మన్, ప్రపంచ కప్ విజేత స్మృతి మంధాన తన నిశ్చితార్థాన్ని(Smriti Mandhana Engagement) అధికారికంగా వెల్లడించింది. తన జీవితంలో జరిగిన ఈ స్పెషల్ మూమెంట్‌ను పంచుకోవడానికి ఆమె ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుంది. తన టీం ఇండియా ఆటగాళ్లతో ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ చేసి తన ఎంగేజ్‌మెంట్‌ను అందిరితో పంచుకుంది. 

Also Read :  IND Vs SA: టీమిండియాలో భారీ మార్పులు.. రెండో టెస్టు కోసం ఉక్కిరిబిక్కిరి..!

Smriti Mandhana Engaged

ఆమె షేర్ చేసిన రీల్‌లో జెమిమా రోడ్రిగ్స్, శ్రేయంకా పాటిల్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డిలు కలిసి 2006లో విడుదలైన లగే రహో మున్నా భాయ్ చిత్రం ‘‘సమ్ఝో హో హి గయా’’ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చివరి ఫ్రేమ్‌లో.. మంధాన తన నిశ్చితార్థ ఉంగరాన్ని కెమెరాకు చూపి.. చాలా కాలంగా ఉన్న నిశ్చితార్థ రూమర్స్‌ను అధికారికంగా నిజం చేసింది. 

Also Read :  చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా..  యువరాజ్ సింగ్ తండ్రి సంచలన ఆరోపణలు!

ఆమె సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం Smriti Mandhana Wedding Date Fix. తాజాగా అతడితోనే మందన్నా ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. పలాష్ ఇప్పటికే స్మృతి మంధానతో తన వివాహాన్ని వెల్లడించాడు. గత నెల అంటే అక్టోబర్‌లో ఇండోర్‌లోని స్టేట్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో.. పలాష్ స్మృతితో తనకున్న సంబంధం గురించి ఒక అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అతడు ఓపెన్‌గా చెప్పకపోయినా.. స్మృతి మంధాన త్వరలో ‘ఇండోర్ కోడలు’ అవుతుందని సరదాగా చెప్పుకొచ్చాడు. కాగా వీరిద్దరూ గత కొన్నేళ్లుగా సీక్రెట్ రిలేషన్‌లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. పలు పార్టీలు, ఈవెంట్లు, కార్యక్రమాలకు కలిసి తిరుగుతూ చాలాసార్లు కెమెరాలకు చిక్కారు. 

Advertisment
తాజా కథనాలు